opposition question amit shah on his tweet అమిత్ జీ.. ప్రజాతీర్పు ఆక్కడ వర్తించదా..?

Opposition parties question amit shah on his people s verdict tweet

amit shah, karnataka results, twitter, tejaswi yadav, opposition parties, congress, rjd, bihar, manipur, goa, bjp, karnataka, politics

opposition parties question BJP national president Amit shah on his people's verdict tweet, why the same is not implimented in goa, manipur, and bihar.

అమిత్ జీ.. ప్రజాతీర్పు ఆక్కడ వర్తించదా..?

Posted: 05/17/2018 03:44 PM IST
Opposition parties question amit shah on his people s verdict tweet

కర్ణాటక రాష్ట్రంలో మెజారిటీ వున్న కాంగ్రస్-జేడీఎస్ కూటమిని బలనిరూపణకు పిలవకుండా.. తన సొంతగూటికి చెందిన యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటకా రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా పిలవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో.. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి చేసిన ట్విట్ ఆ పార్టీ ద్వంద విధానాలను ప్రజల ముంగిట అవిష్కృతమయ్యేలా చేస్తుంది. కర్ణాటకలో మెజారిటీ వున్న తమను కాదని, మైనారిటీలో వున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అహ్వానించడం అంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి.

తమిళనాడుకు చెందిన విపక్ష డీఎంకే పార్టీ కూడా రంగంలోకి దిగి.. గవర్నర్ నిర్ణయం బేరసారాలను అడుకునేందుకు అధికార పార్టీకి అవకాశం కల్పించడమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో అమిత్ షా తనదైన శైలిలో స్పందిస్తూ.. ఎవరిది ప్రజాస్వామ్యం, ఎవరికి ప్రజలు మద్దతు పలికారు..? ఎవరి పక్షాన ప్రజలు నిలిచారు.? అసలు ప్రజలు కోరుకున్నదేమిటి..? అంటూ విపక్షాలపై ప్రశ్నలను సంధిస్తూ చేసిన ట్వీట్.. ఆయనకే శాపంలా పరిణమించింది. అంతేకాదు.. బీజేపి ఏ ఎండకాగొడుగు పడుతుందని.. ఒక విధానం అంటూ ఏదీ లేదని, కేవలం అధికారమే పరమావధిగా ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు నెట్ జనులు కూడా అభిప్రాయపడుతున్నారు.

కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహస్యమైందని, ఖూనీ చేయబడిందని కాంగ్రెస్, జేడీఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ‘‘కర్ణాటకలో ప్రజాతీర్పు ఎవరికి ఉంది...? బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. లేదా.? కాంగ్రెస్ 78 సీట్లకు పడిపోయిందా.? కాదా.? ఆ పార్టీ సీఎం, మంత్రులు కూడా భారీ మార్జిన్లతో ఓటమి పాలయ్యారా.? లేదా.? జేడీఎస్ కేవలం 37 సీట్లలోనే గెలుచుకుందా లేక అధిక సీట్లను గెలుచుకుందా.? పలు సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయిందా.? లేదా.? ప్రజలు అర్థం చేసుకోగలరు’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

ఆమిత్ షా ఈ ట్వీట్ చేసిన వెనువెంటనే నెట్ జనుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. మీది ఇదే విధానమైతే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అదే విధానాన్ని అవలంభించాలి కదా..? అలా కాకుండా మణిపూర్, గోవా, బిహార్ లలో అతిపెద్ద పార్టీలుగా అవతరించిన రాజకీయ పార్టీలను కాదని బీజేపి ఎందుకు అధికారాన్ని చేపట్టింది.? కర్ణాటకలో ఒక విధానం, మిగతా రాష్ట్రాల్లో మరో విధానమా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మరికోందరైతే మీకు అసలు విధానమనేది వుందా.? అంటూ నిగ్గదీసి అడిగారు.

అదే క్రమంలో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, అర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచినందున, తక్షణమే బీహార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు పెద్ద పార్టీనే అవసరమైతే, రాష్ట్రంలో తమదే అతిపెద్ద పార్టీ అని ఆయన గుర్తు చేశారు. దీంతో అమిత్ షా చేసిన ట్వీట్ ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెట్టడం కోసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  karnataka results  twitter  tejaswi yadav  opposition parties  congress  rjd  bihar  manipur  goa  bjp  karnataka  politics  

Other Articles