will Tdp dreams of power in 2019 come true..? ఒంటరైన టీడీపీ.. మునిగిపోయే పడవగా మారుతుందా.?

Tdp dreams of comming into power in 2019 elections comes true

chandrababu, pawan kalyan, jagan, PM modi, TDP, BJP, JanaSena, YSRCP, andhra pradesh, politics

Andhra pradesh ruling party which came into power only with a margin of less than 6 lakh votes, and that too with the support of jana sena chief power star pawan kalyan, dreams to sustain the power in forth comming elections, will it really come true.?

ఒంటరైన టీడీపీ.. మునిగిపోయే పడవగా మారుతుందా.?

Posted: 04/09/2018 03:52 PM IST
Tdp dreams of comming into power in 2019 elections comes true

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందా..? అన్న ప్రశ్న ప్రస్తుతం తరుణంలో హాట్ టాపిక్ గా మారగా, టీడీపీకి చెందిన పలువురు ద్వీతీయ శ్రేణి నేతలు అప్పుడే తమ అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీల వైపుకు మళ్లుతుండగా.. ఇక పార్టీలో నేతల మధ్య వున్న విభేదాలు మరోమారు అగ్రనేతల వలసలకు కూడా కారణమవుతున్నాయా..? అన్న సందేహాలు ఉత్పన్నం అవతున్నాయి. టీడీపీలోని మంత్రుల మధ్య ఉన్న విభేదాలతో పాటు, పలు నియోజకవర్గాల్లో వలస వచ్చిన నేతలు.. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలకు పొసడగం లేదన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఇప్పటికే గత ఎన్నికలలో మిత్రపక్షాలుగా వున్న బీజేపి, జనసేన పార్టీలు అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి దూరం కాగా, ఇక వామపక్షాలు కూడా టీడీపీతో జతకలసే అవకాశం లేక టీడీపీ ఒంటరిగా మిగిలిపోయింది. కేంద్రంలోని బీజేపి పార్టీని ముద్దాయిగా చేస్తూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన అరోపణలు, విమర్శలు చేస్తున్నా.. మీడియా మ్యానేజ్ మెంట్ తెలిసిన టీడీపీ.. అటు పత్రికలలో, ఇటు మీడియాలో తమ వార్తలను కవర్ చేయిస్తున్నా.. అదే స్థాయిలో మాత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్నది మాత్రం వాస్తవమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు బీజేపిని పక్కనబెడితే.. జనసేన చేసిన అరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కారణమని టాక్.

ఈ క్రమంలో ఏకంగా మంత్రుల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు కేవలం పదవుల కోసమే టీడీపీలో చేరారని, గతాన్ని మరచిపోయి ఆయన మాట్లాడుతున్నారని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. తొలుత తెలుగుదేశంలో ఉండి, ఆపై ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరి, తిరిగి ఆయన మంత్రి పదవి కోసమే టీడీపీలోకి వచ్చారని, మూడు పార్టీలు మారిన విషయాన్ని మరచిపోయి, ఆయనకు మంత్రి పదవిని ఇస్తే, ఇప్పుడు రాజకీయ స్వలాభాన్నే ఆయన చూసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

అయితే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే అందరినీ రాజీకీ తీసుకువచ్చా మళ్లీ అధికారం అందుకోవచ్చుకున్న టీడీపీ కల చెందిరింది. దీంతో ప్రస్తుతం వున్న 175 నియోజకవర్గల్లోనే తమ నేతలను పోటీ చేయించాలి. అయితే వలసవచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలా..? లేక తమ పార్టీకి చెందిన నేతలకే సీట్లు ఇవ్వాలా అన్నది పార్టీలో ప్రశ్నార్థకంగా మారింది. ఇక వలసదారుల వల్ల తమకు అవకాశం రాదన్న పలువరు నేతలు పక్క పార్టీల వైపు చూపును మరలిస్తున్నారని కూడా సమాచారం. ఇక టీడీపీ పరిస్థితిని అంచనా వేసిన పలువురు నేతలు కూడా మునిగిపోయే పడవలో ఎందుకున్నట్లు పార్టీలు మారేందుకు కూడా రెడీ అవుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఇంకా ఏడాది సమయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  pawan kalyan  jagan  PM modi  TDP  BJP  JanaSena  YSRCP  andhra pradesh  politics  

Other Articles