chandrababu guess cbi may withdraw cases on YS Jagan చంద్రబాబు జోతిష్యుడి అవతారం ఎత్తారా.?

Chandrababu guess cbi may withdraw cases on ys jagan

chandrababu, nara lokesh, janasena, pawan kalyan, no confidence motion, YSRCP, YS Jagan, centre conspiracy, TDP, corruption, andhra pradesh special status, vishaka railway zone, andhra pradesh politics

TDP president and AP chief minister chandrababu says his party's no confidence motion on nda government has bought three parties conspiracy into light.

ఎన్నిసార్లు బాబూ.. చారిత్రక తప్పిదం..?

Posted: 03/17/2018 12:23 PM IST
Chandrababu guess cbi may withdraw cases on ys jagan

ఇన్నాళ్లు కేంద్రంతో దోస్తీ చేసి.. కేంద్రంతో వైరం పెంచుకుని ఏం సాధించలేమని చెప్పుతూ.. ఇక కేంద్రం ప్రత్యేక హోదాకు నో చెప్పినా.. దానిని కూడా స్వాగతించి.. హోదా కన్న ప్యాకేజీయే ముద్దు అని చెప్పిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా అటు కేంద్రం నుంచి ఇటు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిరాగానే అదే కేంద్రంపై.. ప్రధాని మోడీపై కూడా విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజీలో తమకు న్యాయం చేయలేదని, తమకు తప్పనిసరిగా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం పెట్టనున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో తమను ఎలాగైనా గట్టెక్కించాలని జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాన్ వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ఆయనతో అవసరం తీరిన తరువాత.. పార్టీ నేతలను విమర్శలకు దింపారు. అయినా ప్రత్యేక హోదా విషయంలో పనవ్ ఎన్నిసార్తు టీడీపీ ఎంపీలను, తిట్టినా పట్టని చంద్రబాు.. తాజాగా మంగళిరి సభలో ఆయన పార్టీ నేతలు. స్వయంగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ చేస్తున్న అవినీతిని టార్గెట్ చేయగానే పవన్ ను కూడా తనకు వ్యతిరేకంగా బీజేపితో లాలూచీ పడ్డాడని అరోపణలు చేయాడు.

ఈ దెబ్బకు చంద్రబాబు జోతిష్యం కూడా నేర్చుకున్నాడు కాబోలు. తన అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో మూడు పార్టీల కుట్ర భయపడిందని చెప్పడమే కాకుండా ఏకంగా రేపో మాపో.. వైసీపీ అధినేత జగన్ పై నమోదైన అక్రమాస్థులకు సంబంధించిన కేసులు కూడా కేంద్రం కొట్టేయింస్తుందని జోస్యం చెబుతున్నారు. కేవలం అందుకోసమే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఇతర వైసీపీ నేతలు ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అరోపించారు.  దానికి ప్రతిఫలంగానే కేసులలో జగన్ కు సడలింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంతకుముందు పవన్ తో బీజేపి అమరణ నిరాహార దీక్ష చేయింది.. అదికాస్తా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారగానే,, ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రాంలో పేద్దఎత్తున అందోళన చేపట్టిన తరువాత బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ కూడి ఇవ్వాలని ప్రణాళిక రచించిందని .. ఇదంతా తెరవెనుక కుట్ర జరుగుతుందని చంద్రబాబు ఇప్పటికే జోస్యాన్ని చెప్పిన విషయం తెలిసిందే. అసలు పవన్ ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదని అన్న చంద్రబాబు.. పవన్ నిజనిర్థారణ కమిటీలో తేల్చిన విషయాల తరువాతే ఇలా పంథా మార్చరని ఎందుకు గుర్తించడం లేదన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అయితే నాలుగేళ్లుగా కేంద్రంతో జతకట్టిన చంద్రబాబును కేంద్రం ఎందుకు నమ్మడం లేదన్న విషయం.. ప్రత్యేక హోదా కాదుకదా.. కనీసం విశాఖ రైల్వేజోన్ కూడా ఎందుకు ఇవ్వలేదు.. టీడీపీ భుజాలు చరుచుకున్న ప్రత్యేక ప్యాకేజీని కూడా ఎందుకు ఇవ్వలేకపోయిందన్న విషయం మాత్రం చంద్రబాబుకు ఆయన నాయకగణానికే తెలియాలి. కేంద్రంతో దోస్తీ చేసిన చంద్రబాబు ఎందుకు దూరమయ్యాడు.. అవినీతిపరుడు అని అరోపించే జగన్ ఎలా చేరువయ్యాడన్న ప్రశ్నలు కూడా రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.

దీంతో ఇటు ఆయా పార్టీల నేతలు కూడా చంద్రబాబుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానిగా చేసిన హాయంలో ఎన్డీయేతో కలసి జతకట్టిన తరువాత బీజేపితో దోస్తీ చేయడం చారిత్రక తప్పిదమని చెప్పిన చంద్రబాబు.. మళ్లీ అదే పార్టీతో జతకట్టి ఎన్నికలకు ఎలా వెళ్లారన్న అప్పట్లో మీడియా సహా పలు పార్టీలు, రాజకీయ విశ్లేషకులు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు చంద్రబాబు మరోమారు చారిత్రక తప్పిదం చేశారా..? తొమ్మిదేళ్లు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని బీరాలకు పోయే అనుభవం కల్గిన రాజకీయ నేతలు ఎవరైనా ఇలాంటి తప్పులను మళ్లీ మళ్లీ చేస్తారా..? ఆయన తప్పులకు రాష్ట్ర యువత భవిత, ప్రగతి కుంటుపడినా పర్వాలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పదే పదే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వల్లే వేసే చంద్రబాబు.. నిజంగా ఆ మాటలకు కట్టుబడి వుంటే.. తనకు సాయం చేసి గత ఎన్నికలలో అధికారంలోకి తీసుకువచ్చిన పవన్ కల్యాన్.. నిరాహార దీక్ష చేసిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను, విశాఖకు రైల్వేజోన్ ను తీసుకువచ్చి.. రాష్ట్ర ప్రగతిని శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చస్తానంటే.. స్వాగతించక.. ఇంకా తనకే అధికారం కావాలన్న యావతో.. తన పార్టీ అధికారానికి ఎక్కడ దూరమవుతుందున్న అంధోళనతో చంద్రబాబు.. బేషబావాలకు పోయి విమర్శలు చేస్తున్నారని ఆయా పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

నాలుగేళ్లగా కేంద్రంతో మైత్రిని కొనసాగించి.. అప్పుడు ఇదేం తరహా మైత్రి అని పలువురు రాజకీయ విశ్లేషకులు, పార్టీలు ప్రశ్నించినప్పుడు.. మీ గొంతు నుంచి ఒక్క మాట కూడా కేంద్రానికి వ్యతిరేకంగా రాలేదు సరికగా, కేంద్ర మనకు చేయాల్సిన దానికన్నా ఎక్కువ సహకారం చేస్తుందని కూడా చంద్రబాబు చెప్పారు. అప్పట్లో కేంద్రమంత్రిగా వున్న వెంకయ్యనాయుడు కూడా తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి ఒక్కో ప్రాజెక్టును తీసుకువస్తానని కూడా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం నిలతీసిన ప్రతీసారి అయన తనకు ఏపీతో సంబంధమే లేదన్న వ్యాక్యలు కూడా చేశారు. అప్పడు ఏమీ మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు తన గొంతను కేంద్రానికి వ్యతిరేకంగా వినిపించడం కేవలం ఎన్నికల జిమ్మిక్కు.. అధికారంపై వున్న యావ కాదా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

పవన్ కల్యాన్ ప్రశ్నించినట్లు ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలోకి తెప్పించుకోగలిగిన చంద్రబాబుకు.. హైకో్ర్టు విభజన కానీయకుండా అడ్డుకోగలుగుతున్న చంద్రబాబుకు.. ప్రత్యేకహోదాపై కూడా అంతే ప్రేమ, చిత్తశుద్ది, రాష్ట్ర ప్రగతిపై అకాంక్ష, అభివృద్దిపై ధ్యాస వుండివుంటే నాలుగేళ్లు పూర్తైన తరువాత కాకుండా.. తొలిబడ్జెట్ లోనే తమ హోదా కోసం కేంద్రాన్ని నిలదీసేవారని అయా పార్టీల నేతలు అంటున్నారు. అప్పడే చంద్రబాబు తనకున్న నేషనల్ లీడర్ ఇమేజ్ తో జాతీయ స్థాయిలో తన గొంతుకను వినిపించివుంటే.. అప్పుడే యావత్ దేశం చంద్రబాబువైపే చూసేదని, నాలుగేళ్లు వారితో అంటకాగిన తరువాత ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు కేంద్రంతో కుస్తీ చేయడాన్ని ప్రజలు స్వాగతించరని.. అయినా అనుభవజ్ఞడైన చంద్రబాబుకు అంత్యనిష్టూరం కన్నా అదినిష్టూరం మేలని తెలియదా..? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles