janasena questions chandrababu on his remarks on pawan kalyan.? అవినీతి, వెన్నుపోటు అరోపణలపై ఎందుకు మాట్లాడరూ..?

Janasena activists questions chandrababu on his remarks on pawan kalyan

Pawan Kalyan nri wing, pawan kalyan nri activists, pawan kalyan nri wing note bank, pawan kalyan nri wing party networking, chandrababu, nara lokesh, TDP. corruption, sand mafia, AP special status, indefinite hunger strike, visakha railway zone, jana sena foundation day, jana sena foundation day mangalagiri, jana sena foundation day, Political Yatra, pawan kalyan nri meet, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh, politics

After Andhra pradesh chief minister chandrababu responds on actor turned politician Jana Sena chief pawan kalyan speech.. party activists question TDP chief on various issues.

అవినీతి, వెన్నుపోటు అరోపణలపై ఎందుకు మాట్లాడరూ..?

Posted: 03/15/2018 01:45 PM IST
Janasena activists questions chandrababu on his remarks on pawan kalyan

సమైక్య అంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తిగా ఇప్పటికే చరిత్రపుట్టల్లో పేరును నమోదు చేసుకున్న టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు.. తనపై ఎవరు అరోపణలు చేసినా.. తన పార్టీ నేతలో విమర్శలు చేయించడం అలావాటుగా మారిందని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పి హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తానేనని నమ్మబలికిన చంద్రబాబు.. పవన్ కల్యాన్ తో జతకట్టి తమకు ఒరిగిన లాభమేమీ లేదని చెప్పడం ఓడ మల్లన్నా, బోడ మల్లన్నా నానుడిని గుర్తు చేస్తుందని అన్నారు. 2014లో తమ అధినేత మద్దతు కోరింది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ టీడీపీ పార్టీలో కీలక నేతగా వుండి కాంగ్రెస్ లోకి వలస వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆ క్రమంలో చేసిన అరోపణలపై ఒక్క మాట కూడా చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడికి రూ.2000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారని, పరిటాల శ్రీరామ్ తో పయ్యావుల వారుసుడు తెలంగాణలో బీర్ ఫ్యాక్టరీ పెట్టారన్న అరోపణలపై స్పందించని చంద్రబాబు.. 2014లో అధీకారంలోకి రావడానికి కారణమైన పవన్ కల్యాన్ చేసిన అరోపణలపై మాత్రం ఎలా స్పందించారని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా గతంలో చంద్రబాబుపై అనేక అరోపణలు సంధించారని మరీ వాటిపై ఎందుకు స్పందించలేదని జనసైనికులు నిలదీస్తున్నారు. వంగవీటి రంగా హత్యకేసులో కథ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదేనని, దీనిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు వ్యతిరేకించినా.. జరగాల్సిన ఘోరం జరిగిందని అయన అరోపణలు సంధించినా.. ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం.. ఎన్టీయార్ కు వెన్నుపోటు అంశమని.. దానిపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాసినా.. చంద్రబాబు అన్నింటినీ తన రాజకీయ చతురత, మాటలతో మభ్యపెట్టారని జనసైనికులు విమర్శిస్తున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాన్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఏడాది కాలం తరువాత నుంచి ప్రశ్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు తమ వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకోవడంపై వున్న శ్రద్ద.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో చూపడం లేదని కూడా విమర్శించారు. అప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి నుంచి ఎంపీలందరూ ఒక్కొక్కరుగా పవన్ కల్యాన్ ను టార్గెట్ చేసి విమర్శలను గుప్పించారని.. అది చాలదన్నట్లు అతని సోదరుడు చిరంజీవిపై కూడా కేశినేని విమర్శలు చేశారని జనసైనికులు గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి.. ప్రత్యేకహోదాతోనే న్యాయం జరుగుతుందని అన్నదెవరని జనసేన కార్యకర్తలు నిలదీస్తున్నారు.

ఇక మీతో లాభం లేదని పవన్ కల్యాన్ ప్రజల్లోకి నేరుగా వెళ్లి ప్రత్యేక హోదా కోసం గళం విప్పితే.. అర్థరాత్రి హైడ్రామా మధ్య హోదా కన్న ప్యాకేజీయే మిన్నా.. అన్నది ఎవరని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారని విమర్శలు చేస్తే.. హోదాను మించిన లాభం ప్యాకేజీతో వస్తుందని నమ్మబలికింది ఎవరు..? హోదా అన్నది ముగిసిన అద్యాయమని, ప్యాకేజీతోనే అభివృద్ది సాధ్యమని కొత్త వాదనను తీసుకోచ్చిందెవరు..? ఇక కనీసం ప్యాకేజీ అయినా చట్టబద్దతతో కూడకున్నది చేయాలని ప్రశ్నిస్తే.. అలానే చేస్తామని చెప్పిందెవరు..? ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, అది అంధ్రుల హక్కు అని మళ్లీ వాదిస్తున్నదెవరు..? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

ఇక చంద్రబాబు అవినీతి గురించి కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు..? రాష్ట్రంలో ఆ బిగ్ బాస్ ఎవరు అన్న మైసూరారెడ్డి ప్రశ్నలకు, తెహెల్కా కథనాల అంశాలను కూడా ప్రస్తావించిన జనసైనికులు.. వాటిపై మాత్రం ఇప్పటి వరకు చంద్రబాబు అసలు నోరే విప్పలేదని.. అతని మాట కనీసం పెదవి కూడా దాటలేదని అన్నారు. గత ఎన్నికలలో మీరై జనసేనాని వద్దకు వచ్చి మద్దతు అడిగి, నిజనిర్థారణ కమిటీలో హోదా రాకపోవడానికి కారణాలను కూడా తెలుసుకున్న తరువాత ముక్కుసూటిగా పవన్ కల్యాన్ ప్రశ్నిస్తే మాత్రం విమర్శలు చేస్తారా.. అని నిలదీస్తున్నారు.

ఇక మరికోందరు జనసైనికులు మాత్రం తమ అధినేత పవన్ కల్యాన్ సభలో ప్రసంగించిన మాటల్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థలోంచి డబ్బులు తీయరని, కానీ ఆ పార్టీ ఎన్నికలలో కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు సిద్దమైందని పవన్ అన్నారని, ఇంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తుందని నిలదీస్తున్నారు. ప్రజాధనాన్ని ఖర్చు రూపంలో చూపుతూ తమ జేబుల్లోకి నోక్కేసుకుంటున్నారన్న పవన్ వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles