ILC Postponed After RSS labour wing Threatens To Boycott ప్రధాని మోడీని భయపెట్టిందెవరూ.? ఐఎల్సీ వాయిదా అందుకేనా.?

Govt postpones il conference after threat from rss labour wing in modi protest

indian labour conference, indian labour conference postponed, rss trade body, bms rss trade union, india central trade unions, labour ministry, Bharatiya Mazdoor Sangh, Union Budget, anti-labour policies, BMS president, Saji Narayanan

The Centre has indefinitely postponed the Indian Labour Conference to be inaugurated by PM Modi after RSS trade union BMS threatened to boycott it over the Union budget that was “unsympathetic to labour and workers”.

ప్రధాని మోడీని భయపెట్టిందెవరూ.? ఐఎల్సీ వాయిదా అందుకేనా.?

Posted: 02/20/2018 05:08 PM IST
Govt postpones il conference after threat from rss labour wing in modi protest

భారత ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీని భయపెడుతున్నదెవరూ... ఆయన వస్తున్నారంటేనే ప్రతిపక్షాలు సైతం మిన్నకుండిపోతున్న తరుణంలో ఆయన ఎవరికి జంకుతున్నారు.? ప్రధానేంటి భయమేంటి అని అంటారా..? అవునండీ నిజమే.. ప్రధాన మంత్రి మోడీ నిజంగా వారిని చూసి భయపడుతున్నారు. ఈ విషయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీ వారిని చూసి భయపడటమే కాదు.. వారు అనుకున్నంత పని చేస్తే తాను అంచెలంచెలుగా ఎదిగుతూ.. ఏర్పర్చుకున్న గౌరవమర్యాదలకు కూడా భంగం వాటిల్లుతుందని కూడా భావించి.. ప్రసంగాలంటే ఇష్టమడే మోడీ తన ప్రసంగించే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు.

ఇంతకీ వాళ్లు ఎవరు..? అంటే కార్మికులు.. ఉద్యోగులు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస శృంఖాలాలు తప్ప అన్న నానుడి పారిశ్రామక ప్రగతిని కాంక్షతో పాటు ఉద్యోగ, కార్మికుల సంక్షేమం చేపట్టాలన్న అటు పారిశ్రామిక వేత్తలకు, ఇటు కార్మక సంఘాలు మధ్య నడిచిన ఉద్యమంలో వెలుగుచూసిందేనన్న విషయం అర్థం చేసుకున్నారో ఏమో కానీ ప్రధాని మాత్రం తన ప్రసంగాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దేశంలో ఉద్యోగ సృష్టి, కార్మికుల సాంఘిక భద్రతపై 26, 27 రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన ఇండియన్ లేబర్ కాన్ఫరెస్స్ ను వాయిదా వేసింది. సదస్సును వాయిదా వేసినందుకు చింతవ్యులం అని కూడా పేర్కొంది.

అయితే ఈ ఐఎల్సీ సదస్సులో అధికార పార్టీకి అనుబంధంగా వున్న అర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని భారతీయ మజ్ధూర్ సంఘ్ కార్మిక సంఘమే ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు కూడా చేసింది. ఈ క్రమంలో ఈ నెల 20న బ్లాక్ డే గా కూడా పాటించాలని, ఎక్కడికక్కడ నల్ల జెండాలతో ప్రదర్శనలు, గేట్ మీటింగ్లు పెట్టి.. కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కూడా రాష్ట్ర శాఖలకు పిలుపునిచ్చింది.

ఇందుకు అజ్యం పోసింది కూడా కేంద్ర బడ్జెట్టే. కేంద్ర బడ్జెట్ లో కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించిన పదాలే లేవని భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు సాజీ నారాయణ్ అన్నారు. కార్మికులను, కార్మిక సంఘాలను గుర్తించని ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ లేబర్ కాన్షరెన్సులో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని అడ్డుకోవాలని, సాధ్యం కాని పక్షంలో బాయ్ కాట్ చేయాలని కూడా అయన తెలిపారు. ఇక దేశంలో రెండో అతిపెద్ద కార్మిక సంఘం ఐఎన్టీయుసీని ఈ సదస్సుకు అహ్వానించకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయంపైన మిగిలిన కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో వారు కూడా బీఎంఎస్ బాటలోనే పయనించేందుకు రెడ్డీ అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఐఎల్సీ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించే అవకాశాలు వున్నాయని సమాచారం చేరవేడంతో సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ సదస్సును వాయిదా చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ సదస్సును ఎప్పుడు ఏర్పాటు చేస్తామన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో కార్మిక సంఘాలు ఇది తమ నైతిక విజయమని.. తాము నిరసనలు చేపడుతామన్న సంకేతాలతో.. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకుంటామన్న తమ హెచ్చరికల నేపథ్యంలోనే ఇండియన్ లేబర్ కాన్సరెన్స్ ను వాయిదా వేశారని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles