People of AP questions modi on his election promises అంగలార్పులోద్దు.. ఎన్నికల హామీలేమయ్యాయో చెప్పండీ.?

People of ap questions modi on his election promises after parliament speech

PM Modi, Parliament. Election Promises, Special status, special package, Andhra pradesh session live,Parliament Budget Session Live,Parliament budget session,Budget Session of Parliament,Prime Minister Modi Speech in Lok Sabha,PM Modi's reply to Motion of Thanks Debate,Motion, PM Modi, Parliament. Election Promises, Special status, special package, Andhra pradesh

After PM Modi's speech in parliament during the budget session comes on the second day of the debate on motion of thanks to the president's address, people of andhra pradesh ask he never touched his election promises givent to them.

అంగలార్పులోద్దు.. ఎన్నికల హామీలేమయ్యాయో చెప్పండీ.?

Posted: 02/07/2018 03:53 PM IST
People of ap questions modi on his election promises after parliament speech

రాష్ట్ర విభజనకు కాకినాడ తీర్మాణాన్ని నాందిగా తీసుకున్నారని రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన బీజేపి నేతల వ్యాఖ్యలను ప్రధాని మర్చిపోయారా.? ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదాన్ని కాకినాడ తీర్మాణంలో ప్రవేశపెట్టిన తీరును మర్చిపోయారా.? లేక మూడు రాష్ట్రాల విభజన సమయంలో అక్కడ తెరమీదుకు వచ్చిన అల్లర విషయాన్ని మర్చిపోయారా.? అంటే అవును అన్నట్లుగానే వున్నాయి ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలోని వ్యాఖ్యలు.

తెలంగాణ ప్రజలకు సెద్దమ్మ సోనియా అయితే తాను చిన్నమ్మనన్న విషయాన్ని మరవరాదని బీజేపి సీనియర్ నాయకురాలు, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చెప్పిన మాటల ప్రస్తావన లేకుండా.. నెపాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీపైనే వేసి.. ప్రజాకోర్టులో గత ఎన్నికలలో నిలిపినట్లుగానే ఈ సారి ఎన్నికల వేళ కూడా మళ్లీ కాంగ్రెస్ ను అడిపోసుకుని తమ స్థానాలను మెరుగుపర్చుకునేందుకు మిత్రపక్షాలైన కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు బీజుపి, టీడీపీలు కుటిలయత్నం చేస్తున్నాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఈ తరుణంలో.. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో చేసిన ప్రసంగాలపై రాష్ట్ర ప్రజలనుంచి విముఖత వ్యక్తం అవుతుంది. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయగలిగే శక్తి, యుక్తి, వున్నది కేవలం బీజేపి పార్టీకేనని, తల్లిని చంపి పిల్లను బతికించారని గత సార్వత్రిక ఎన్నికలలో అంగలార్చిన ప్రధాని నరేంద్రమోడీ.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఎంత మేరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుని అభివృద్దికి నిధులు కేటాయించారో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు.

ఎన్నికలు ముగసిముగియగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించారు. ఈ అంశాన్ని తమ మిత్రపక్షమైన టీడీపీ చేత కూడా ప్రత్యేక హోదా కన్నా పది రెట్టు మిన్నైన ప్రత్యేక ప్యాకేజీ కల్సిస్తామని చెప్పించారు. అర్తరాత్రి హైడ్రామా మధ్య అరచేతిలో వైకుంఠాన్ని చూసిన కేంద్రం.. రెండేళ్లు గడిచి గడవగానే దానిని కాస్తా నీటి బుడగగా మార్చేవేసిందని రాష్ట్రవాసులు మండిపడుతున్నారు.

ప్యాకేజీ వద్దు.. హోదానే ముద్దు అన్న నినాదంతో ముందుకెళ్లిన రాష్ట్ర విపక్ష పార్టీని కూడా తమ అధికార బలంతో ఒత్తిడి చేసి శాంతింపజేసిందని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఇక నేను సైతం అంటూ రాష్ట్ర అభివృద్ది కోసం నూతన పార్టీని స్థాపించిన సినీ నటుడు.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన జనసైన్యంతో ప్రజల్లోకి ప్రత్యేక హోదా విషయమై సభలు సమావేశాలు పెట్టి ఉద్యమానికి శ్రీకారం చుడితే.. దానిని కూడా ఒత్తడితో పక్కదారి పట్టించారన్న విషయం చలో చలోరే చల్ పర్యటనలో భాగంగా పవన్ తన అవేదనను వ్యక్తం చేసిన విషయం కూడా తమకు తెలుసునని రాష్ట్రవాసులు అంటున్నారు.

ఓ వైపు స్వర్గీయ ఎన్టీరామారావును పేరును ఊటంకిస్తూ.. రాష్ట్ర విభజన చీకటి అధ్యాయమని పేర్కొంటూ ముందుకు సాగుతన్న బీజేపి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయదా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏ ఎండకాగొడుగు పట్టే విధంగా ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రసంగాలు చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు.

* ఇప్పుడు మీరు రాష్ట్ర అభివృద్దికి ఎన్ని నిధులు ఇస్తారన్న విషయాన్ని చెప్పాలి
* ఏపీలో విజయవాడ, అవరావతి, గుంటూరు రైల్వే లైన్ కు ఎన్ని నిధులు కేటాయిస్తారు.
* అమరావతిలో రాజధాని, సెక్రటేరియట్, అసెంబ్లీ, నిర్మాణాలకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు
* పోలవరం ప్రాజెక్టులకు ఎన్ని నిధులు ఇస్తారు.?
* రాష్ట్ర విజభజ చట్టంలో అంశాలకు కట్టుబడి మొత్తంగా ఎన్ని నిధులు ఇస్తారు.?
* సర్వసాధారణంగా అన్ని రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపుల మాదిరిగా ఏసీకి ఎన్ని నిధులు కేటాయించారు.?
* గత నాలుగేళ్లుగా ఎన్ని నిధులు కేటాయించారు.?
* విజభన చట్టానికి కట్టుబడి గత నాలుగేళ్లుగా ఎన్ని నిధులు ఇచ్చారు.?
* రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఎన్ని ప్రత్యేక నిధులిచ్చారు.?
* రాష్ట్రంలో సముద్రతీర ప్రాంతాల్లో పోర్టు నిర్మాణం కోసం ఎన్ని నిధులు కేటాయించారు.?
* విభజన క్రమంలో అర్థికలోటులో వున్న రాష్ట్రాన్ని గత నాలుగేళ్లుగా ఎలా అదుకున్నారు.?
* రాష్ట్రంలోని యువతకు నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ఎన్ని ప్రత్యేక నిధులిచ్చారు.?
ఈ ప్రశ్నలతో పాటు ఇంకా అనేక ప్రశ్నలను రాష్ట్ర ప్రజలు కేంద్రంలోని నరేంద్రమోడీని ప్రభుత్వాని అడుగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Parliament. Election Promises  Special status  special package  Andhra pradesh  

Other Articles