Disqualification Recommendation for Kurnool MP బుట్టా రేణుక.. తట్టా బుట్టా సర్ధుకోవాల్సిందేనా.?

Disqualification recommendation for kurnool mp butta renuka

butta renuka, kurnool mp, ysrcp toi tdp, disqualification recommendations, Butta Renuka office of profit. Union Government, Social Welfare Board, Lok Sabha Speaker, Sumitra Mahajan, BJP, NDA Government, PM Modi, parliamentary affairs minister

Parliamentary Privileges Committee has recommended the disqualification of Kurnool MP, Butta Renuka for holding the office of profit. Interestingly, the Union Government itself appointed her to Social Welfare Board.

బుట్టా రేణుక.. తట్టా బుట్టా సర్ధుకోవాల్సిందేనా.?

Posted: 02/13/2018 04:34 PM IST
Disqualification recommendation for kurnool mp butta renuka

దేశ రాజధాని ఢిల్లీలోని అధికార ఎమ్మెల్యేలను ఇటీవలే టార్గెట్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు కార్యదర్శులుగా బాధ్యతలను నిర్వహిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటించాలని ఏకంగా రాష్ట్రపతికి సిఫారసు చేసిన సీఈసీ.. ఇక అలాంటి లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న ఎంపీలపై కూడా దృష్టిసారించింది. ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్రానికి చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు పదవీ గండం పొంచి ఉన్నట్టు సమాచారం. ఎంపీగా కొనసాగుతూనే మరో లాభదాయక పదివిని అనుభవిస్తున్న కారణంగా అమెకు ఈ పదవీగండం ఏర్పడినట్లు సమాచారం.

దీంతో అమెను కూడా త్వరలోనే అనర్హురాలిగా ప్రకటించే అవకాశముందని తెలుస్తుంది. ఎంపీగా ఉన్న రేణుక కేంద్ర శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ) సర్వసభ్య సమావేశ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. దీనిని లాభదాయకమైన పదవిగా పేర్కొన్న పార్లమెంటరీ స్థాయి సంఘం ఆమెపై చర్యలకు సిఫారసు చేసినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే ఈ పదవికి బుట్టా రేణుకతో పాటు రావత్ లను జూలై 26, 2016లో సీఎస్డబ్యూబీ సభ్యులుగా నియమిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయినా అది లాభదాయ పదవి అని నిర్ధారించుకున్న క్రమంలో వారిపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది. కాగా, దీనిపై స్పందించిన రేణుక తనను ప్రభుత్వమే బోర్డులో నియమించిందని, ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు సిఫారసు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. సభ్యురాలిగా ఉన్నప్పటికీ బోర్డు నుంచి తాను ఎటువంటి జీతభత్యాలను అందుకోవడం లేదని రేణుక స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles