Has Vishal justified with officer transfer నటుడు విశాల్ న్యాయం ఇలా చేశారా..?

How is actor vishal justified with election officers move

Vishal Krishna, Actor Vishal, Vishal open letter, R.K. Nagar, RK Nagar by election, nomination, by elections, velusamy, k.velusamy, democracy buried, prakash raj, signatures forged, kanyakumari, fisher man, political stagegy, next political move, ttv dinakaran, stalin, tamil politics

Actor Vishal Krishna’s nomination papers for the bypoll in R.K. Nagar Assembly were rejected by the Returning Officer Velusamy is been call back from duties of Returning officer. questions araise is it justification to the kollywood stat.?

అధికారిపై వేటు.. విశాల్ కు ఇలా న్యాయం చేశారా.?

Posted: 12/09/2017 06:35 PM IST
How is actor vishal justified with election officers move

అర్కేనగర్ ఉప ఎన్నికలలో బరిలోంచి ప్రముఖ కాలీవుడ్ నటుడు విశాల్ నామినేషన్ ను స్ర్కూటినీ సమయంలో అధికారులు అత్యంత నాటకీయ పరిణామాలలో తొలగించిన రిటర్నింగ్ అధికారి వేలుస్వామి విషయంలో అధికారులు చేతులు కాలక అకులు పట్టుకున్న చందంగా చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అర్కే నగర్ ఉప ఎన్నికలలో ఎందరో అశావహులు బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తుఫాను మందు ప్రశాంతత మాదిరిగా వున్న విశాల్ చివరి క్షణంలో మాత్రం తాను పోటీ చేస్తున్నట్లు తమిళ మీడియా కోడై కూసింది.

ఆ తరువాత విశాల్ ఊహించినట్లుగానే నామినేషన్ దాఖలు చేశారు. అయితే విశాల్ చేత టీటీవి దినకరణే నామినేషన్ వేయించాడని, ఎన్నికల అనంతరం దినకరణ్ అస్తులపై మరోసారి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఈ చర్యతో ఉత్పన్నమయ్యిందని ఏకంగా అధికారి పార్టీ ఈపీఎస్-ఓపీఎస్ వర్గ ఆర్కేనగర్ అభ్యర్థి మధుసూదనన్ కూడా వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించిన మరుసటి రోజునే ఎన్నికల సంఘం అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులందరి నామినేషనలను స్ర్కూటినీ చేశారు. ఈ స్ర్కూటినీలో జయలలిత మేనకోడలు దీప జయకుమార్ సహా విశాల్ నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయని ప్రకటించారు.

దీంతో అవేశానికి గురైన విశాల్ తన అభిమానులతో ధర్నాకు దిగారు. అ వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. తరువాత వ్యక్తగత పూచికత్తుపై విడుదల చేశారు. విశాల్ నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో తమిళానాడులో ఎన్నికల సంఘం అధికారుల తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో కంగారుపడిన ఎన్నికల అధికారులు విశాల్ నామినేషన్ అంతా సవ్యంగానే వుందని దానిని అమోదిస్తున్నామని ప్రకటించారు. ఆ తరువాత రాత్రి మరోమారు నామినేషన్ తిరస్కరణకు గురైందని ప్రకటించారు. విశాల్ అభిమానుల నుంచి ఒత్తడిని తట్టుకోలేక.. ఆయన నామినేషన్ సక్రమమని ప్రకటించామని కూడా చెప్పడం కాస్తా వారిపై విమర్శలకు తావిచ్చింది.

దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా బాసిల్లుతున్నా.. అది వాస్తవిక రూపంలో మాత్రం బతికిలేదని.. దానికి గొరి కట్టేశారని విశాల్ పదునైన విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో విశాల్ నామినేషన్ ను మరోమారు పున:పరిశీలన కూడా చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే అదీకూడా జరగలేదు. ఇక ఎన్నికల బరి నుంచి విశాల్ ను తప్పించిన తరువాత.. అందుకు కారణమైన అధికారిపై ఎన్నకల సంఘం చర్యలకు ఉపక్రమించింది. రిటర్నింగ్ అధికారిగా వున్న వేలుస్వామిని విధుల నుంచి తప్పించింది.

అయితే తన నామినేషన్ విషయంలో అధికారి వేలుస్వామి ఎవరో నేతల ఒత్తిడిలోనై.. తన నామినేషన్ ను తిరస్కరించారని స్వయంగా విశాల్ వెళ్లి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారితో మెరపెట్టుకున్నా.. లాభం లేకపోయింది. కానీ ఆయనను బరిలోంచి తప్పించిన తరువాత మాత్రం ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమింది. ఇది చేతలు కాలిన తరువాత అకుటు పట్టుకోవడం కాకపోతే మరేంటి అంటూ ఆయన అభిమానులు మండిపడుడుతున్నారు. అప్పుడే విశాల్ నామినేషన్ ను తెప్పించుకని పరిశీలన చేసి అది సక్రమమా లేక అక్రమమా అన్నది తేల్చివుంటే లాభాం వుండేదని అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామిపై ఇప్పుడు చర్యలు చేపట్టినంత మాత్రన.. విశాల్ కు జరిగిన అన్యాయం ఎలా భర్తీ చేస్తారంటూ కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వేలుస్వామి విశాల్ నామినేషన్ తిరస్కరించడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని.. వాటిపై విచారణకు అదేశించాలన్న డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అసలు వేలుస్వామి స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక ఆయన వెనుక బలమైన శక్తులు ఏమైనా వున్నాయా.? వుంటే వారెవరూ..? రాష్ట్రానికి చెందిన శక్తులా..? లేక కేంద్రానికి చెందిన శక్తులా..? అన్నింటినీ వెలుగులోకి తీసుకురావాలన్న వాదనలను కూడా బలం పుంజుకుంటున్నాయి. మరి ఇవి జరిగేనా..? వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor  vishal  velusamy  democracy  rk nagar  political stategy  tamil politics  kollywood  

Other Articles