mla giddi eswari to quit ysrcp and join ruling tdp party సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారా..?

Mla giddi eswari to quit ysrcp and join ruling tdp party

YSRCP, paderu mla, MLA Giddi Eswari, ys jagan, TDP, araku, Visakapatnam, andhra pradesh, politics

if sources are to be believed, visakhapatnam paderu mla giddi eswari to quit ysrcp and to join ruling tdp party..

సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారా..?

Posted: 11/23/2017 06:57 PM IST
Mla giddi eswari to quit ysrcp and join ruling tdp party

తమ ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్యాకేజీల అశచూపి లాగేసుకుంటుందని అరోపించిన నవ్యాంధ్ర విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్.. ఇక తాజాగా ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సాగనంపేందుకు పొమ్మనకుండా పోగబెడుతుందా..? అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో్ చర్చనీయాంశంగా మారాయి. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని తమ పార్టీ నుంచి వదులుకునేందుకు కూడా సిద్దపడిందా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఈ మేరకు అమె తన అవేదనను వ్యక్తం చేసిన ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో వున్నారని తెలుస్తుంది.

ఈ మేరకు అమె తన అనుయాయువులతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది. పార్టీలో వుండి పార్టీ కోసం కష్టపడుతున్న తనకు సమాచారం లేకుండా తన పోరుగు నియోజకవర్గంలో సీటును ఇతరులకు కేటాయించడంపై అమె అసహనం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి నిర్ణయాలు పార్టీ అధిష్టానం తీసుకున్న నేపథ్యంలో తాను ఇతర పార్టీలోకి వెళ్లే గత్యంతరం లేని పరిస్థితులను ఉత్పన్నం చేస్తున్నాయని అనుచరులతో జరిగిన సమావేశంలో అవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

అయితే అమె మీడియాతో మాత్రం తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వైసీపీలోనే ఉంటానని బయటికి చెబుతున్నప్పటికీ ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గిడ్డి ఈశ్వరి కార్యకర్తలతో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అరకు ఇన్‌చార్జ్‌గా కుంభా రవిబాబును నియమించడంపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అలకబూనారు. ఈ నెల 26 లేదా 27న గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  paderu mla  MLA Giddi Eswari  ys jagan  TDP  araku  Visakapatnam  andhra pradesh  politics  

Other Articles