Real game has just begun: Revanth Reddy కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే రేవంత్ తొలి విజయం..?

Had revanth reddy got his first victory without joining congress

Revanth Reddy, Kodandaram, TTDP leaders, chandrababu, AP Intelligence, Joel Davis, jal vihar, hyderbad police, Rahul gandhi, prof. kodandaram, Congress Andhra bhavan, Telangana bhavan, TRS goverenment, KCR, andhra pradesh, politics

Former TDP Telangana working president, A Revanth Reddy, who recently quit the party, will be joining Congress in the presence of AICC Vice President Rahul Gandhi in New Delhi

కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే రేవంత్ తొలి విజయం..?

Posted: 10/30/2017 01:57 PM IST
Had revanth reddy got his first victory without joining congress

కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే రేవంత్ రెడ్డి తొలి విజయాన్ని అందుకున్నారా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్సీ పదవులకు రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో తనతో పాటు కలసి వచ్చే అభిమానులకు పిలుపునిచ్చన రేవంత్.. అప్పుడే తొలి విజయాన్ని అందుకున్నారా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి.

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో ఆయనతో పాటుగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న నేతలతో ఏర్పాటు చేయనున్న సమావేశానికి జల్ విహార్ ను ఆయన కేంద్రంగా ఎంచుకోగా, దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రేవంత్ జల్ విహార్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కానీ, అక్కడి నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కానీ తమకు సమాచారం లేదని, తమ నుంచి అసలు అనుమతి కోరలేదని తెలిపారు.

కాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న క్రమంలో.. సచివాలయం సహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు చెబతున్నారు. దీంతో జల్ విహార్ వద్ద జరుపుతలపెట్టిన అనుచరవర్గం సమావేశాన్ని రేవంత్.. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి మార్చుకున్నారు. ఇవాళ ఉదయం పెద్దమ్మ గుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన ఆయన..  అక్కడే సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలావుండగా, అటు హస్తినలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేవంత్ కు షాకిచ్చాయి. అయనతో పాటు అయన అనుచరగణానికి గదులు కేటాయించాలని చేసిన విన్నపాన్ని అక్కడి అధికారులు తిరస్కరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్న క్రమంలో భారీఎత్తున రేవంత్ అనుచరులు హాజరుకానున్నారు. దీంతో వారందరికీ బస ఏర్పాట్ల కోసం ఏపీ భవన్ ను సంప్రదించగా, రెండు రాష్ట్రాల అధికారులూ గదులు ఖాళీ లేవని చెప్పినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles