vizianagaram ysrcp leaders joins Ruling TDP ఆ జిల్లాలో సైకిల్ వైపు వీస్తున్న (ఫ్యాను) గాలి..!

Vizianagaram ysrcp leaders joins ruling tdp

vizianagram, YS Jagan, TDP, YSRCP, sanjay krishna rangarao, chandrababu, kollagatala veerabhadraswamy, jagan padayatra, botsa satyanarayana, Telugu desam party

vizianagaram ysrcp leaders quits party before their leader YS Jagan starts padayatra and joins Ruling Telugu desam party

ఆ జిల్లాలో సైకిల్ వైపు వీస్తున్న (ఫ్యాను) గాలి..!

Posted: 10/09/2017 05:09 PM IST
Vizianagaram ysrcp leaders joins ruling tdp

ఆంద్రప్రదేశ్ లో నంద్యాల, కాకినాడ ఎన్నికలలో అధికార టీడీపీ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి వైసీపీ పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత అవహించిందా..? అంటే అవుననే అంటున్నారు. ఈ క్రమంలో తన పార్టీ శ్రేణులను, కార్యకర్తలను, అభిమానులను, కాపాడుకుని వారితో నూతనోత్తేజం నింపేందుకు జగన్ ప్రయత్నాలు మొదలెట్టగానే.. ఇటు పార్టీకి చెందిన నాయకులు మాత్రం అందుకు దూరమవుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి కానరానప్పటికీ.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జిల్లాలో మాత్రం ఇదే సీన్ కనిపిస్తుంది.

ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మాత్రం వైసీపీ నేతలు ఆ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో జిల్లాలో క్రమంగా పార్టీ ఆధిపత్యం తగ్గుదోందన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. జగన్ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో హుషారేత్తాల్సిన నాయకత్వం.. పార్టీ శ్రేణులను, కార్యకర్తలు ఉత్తేజపర్చాల్సిందిపోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా పార్టీలకు రాజీనామా చేస్తూ.. అధికార పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి బలహీనమవుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.

బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కృష్ణ రంగారావు ఆ పార్టీని వీడి అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో.. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో అదే బాటలో పయనించి చేకూరేలాభాన్ని అందుకోవాలని జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ నేతలు భావిస్తున్నట్లు వున్నారు. ఈ బాటలో పయనించేవారిలో వైసీపీ జిల్లా సమన్వయకర్త, సీనియర్ రాజకీయ నాయకుడు కోలగట్ల వీరభద్ర స్వామి ముందువరుసలో వున్నారు. ఏకంగా వైసీపీ పార్టీకి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖని వైసీపీ అధినేత జగన్ కి కూడా పంపించినట్లు ఆయన చెప్పారు.

వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నానని.. జిల్లాలో పలువురు నాయకులతో పని చేయడం ఇష్టం లేకపోవడం తప్పనిసరి పరిస్థితిలో తప్పుకుంటున్నానని చెప్పారు. దీంతో జిల్లాలో వైసీపీ పార్టీకి మిగిలిన పెద్ద దిక్కు మాజీ మంత్రి బొత్ససత్యనారాయణే నన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లలో ఆధిపత్యం చూపించాలనుకున్న వైసీపీకి రానున్న ఎన్నికల నాటికి నేతలు వచ్చి చేరుతారా..? లేక నాయకుల కొరత ఏర్పడుతుందా..? అన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles