Chiranjeevi to play key role in AP Congress ఏపీ కాంగ్రెస్ కీలక బాధ్యతలు.. చిరంజీవికేనా..?

Chiranjeevi to play key role in ap congress

Chiranjeevi, PCC Member, Kovvur, Amarajaha Besh, Kovvur, West Godavari, PCC key role, Andhra Pradesh, Pawan Kalyan, JanaSena, Telangana, Congress, Narendra Modi, BJP, Chandrababu Naidu, TDP, Politics

Mega star Chiranjeevi has been appointed as the PCC member by the Congress Party from Kovvur in West Godavari, and speculations are that he may get key role to play in forth coming elections.

ఏపీ కాంగ్రెస్ కీలక బాధ్యతలు.. చిరంజీవికేనా..?

Posted: 10/06/2017 08:36 PM IST
Chiranjeevi to play key role in ap congress

మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ క్రీయాశీలక రాజకీయాలలోకి పునరాగమనం చేయనున్నారా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆయనుకు రాష్ట్ర పార్టీలో కిలక బాధ్యతలను అప్పగించే పనిలో అధిష్టానం వుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. తమ వినతి మేరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజారాజ్యం పార్టీని పార్టీ.. కాంగ్రెస్ లో వీలినం చేసిన నాయకుడిని కొల్పోయేందుకు సుముఖంగా లేని అధిష్టానం.. ఆయనకున్న ప్రజాదరణ, ప్రేక్షకాదరణ దృష్ట్యా పార్టీలో కిలక బాధ్యతలను అప్పగించాలని సన్నధమైందని సమాచారం.

గత మూడేళ్లుగా పార్టీ వ్యవహరాల్లో పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించని చిరంజీవికి.. కీలక బాధ్యతలు అప్పగిస్తే పూనాది స్థాయి నుంచి పార్టీని మళ్లీ బలోపేతం చేస్తారన్న భావిస్తున్న అధిష్టానం.. ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు పశ్చివ గోదావరి జిల్లా కొవ్యూరు నుంచి పిసీసీ సభ్యుడిగా ఎంపిక చేశారని కూడా సంకేతాలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిమాణాలన్నింటినీ గమనిస్తే చిరంజీవి మాత్రమే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల అశాకిరణంగా అధిష్టానం భావిస్తుందా..? అన్న సంకేతాలు వెలువుడుతున్నాయి.

ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళా నేత అమర జహా బేష్ ని పిసిసి సభ్యురాలిగా నియమించిన అధిష్టానం.. చిరంజీవి కోసం అమెను తప్పించిందని కూడా వార్తలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలకు ముందు, తరువాత దూరమైన నాయకులను సమీకరించి.. మళ్లీ పార్టీలో నూతనోత్తేజం తీసుకురాగల సత్తా కేవలం చిరంజీవికి మాత్రమే వుందని కూడా అధిష్టానం భావిస్తుంది.

ఇప్పటికే ఓ వైపు తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ జనసేన పార్టీని స్థాపించి.. రానున్న 2019 ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీనికి తోడు తన పార్టీ సేనను కూడా సిద్దం చేశారు. కాగా అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే పార్టీలతోనే తాను జతకడతానని కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో జాతీయ పార్టీ బీజేపి హామీని నిలబెట్టుకోలేకపోవడంతో దానికి దూరంగా వున్న పవన్ రానున్న ఎన్నకలలో అన్న చిరంజీవికి మద్దుతునిస్తారా..? వీరిద్దరి కలయికతో రాష్ట్రంలో జనసేన, కాంగ్రెస్ కూటమి కూడా ఏర్పడుతుందా..? అన్న సందేహాలకు తావిస్తుంది. మారుతున్న రాజకీయ సమీకరణలు ఏ రూటు ఎంచుకుంటాయో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  PCC Member  Kovvur  Amarajaha Besh  Kovvur  West Godavari  PCC key role  Andhra Pradesh  Politics  

Other Articles