I wasn’t massaging Smriti Irani’s ego: Pahlaj Nihalani వెలుగులోకి కేంద్రమంత్రి తెరవెనుక భాగోతం..

I wasn t massaging smriti irani s ego so i had to be thrown out pahlaj nihalani

Pahlaj Nihalani, Smriti Irani, IB minister, Bajrangi Bhaijaan, Indu Sarkar, Udta Punjab, Anurag Kashyap, Kabir Khan

Former chief of Central Board of Film Certification (CBFC) Pahlaj Nihalani has alleged Information and Broadcasting Minister Smriti Irani put undue pressure on him when he was in office and targeted him.

వెలుగులోకి కేంద్రమంత్రి తెరవెనుక భాగోతం..

Posted: 08/23/2017 10:23 AM IST
I wasn t massaging smriti irani s ego so i had to be thrown out pahlaj nihalani

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏ శాఖ నిర్వహించినా.. ఆ శాఖలో తన అధిపత్యాన్ని కనబర్చాలని ప్రయత్నిస్తుంటారా..? శాఖ అధికారులు చేసే పనుల్లో జోక్యం కల్పించుకుని వారిని ఇబ్బందులకు గురిచేస్తారా..? శాఖపై అమె తన పెత్తనం చెలాయించాలని భావిస్తారా..? ఇలా అమె తనకు తానుగా వివాదాస్పదంగా మారుతారా..? అంటే అవుననే గత అనుభవాలు చెబుతున్నాయి. కేంద్రమంత్రిగా అమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెను వివాదాలు నిత్యం చుట్టుముట్టాయి.

కేంద్రమానవ వనురుల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో అమె విద్యార్హతల విషయమై ప్రారంభమైన వివాదాలు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ శర్మ ఆత్మహత్య.. జేఏన్యూ విద్యార్థుల అరెస్టులు.. దేశద్రోహం కేసులు.. అలా వివాదాల్లో చిక్కుకోగానే అటు రోడ్డు ప్రమాదంలో డాక్టర్ కారును ఢీకొన్నట్లు అభియోగాలు.. అపదలో వున్న వారిని రక్షించాలన్న కనీస మానవత్వం చూపించలేదని నెట్ జనులు విసుర్లు.. అన్ని చుట్టుముట్టి ఏకంగా అమెకు అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను దూరం చేశాయి.

అంత కీలకం కానీ జౌళి శాఖను అమెకు ప్రధాని అప్పగించారు. దీంతో అమె కాస్త నెమ్మదించారు. కేవలం శాఖా పరంగా తన పనులు చూసుకుంటూ.. అటు మీడియాలో కూడా అంతగా హైలెట్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ నేపథ్ంయలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దేశ ఉప రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో ఆయన శాఖలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి అదనంగా కేటాయించారు. దీంతో మళ్లీ మరో కీలక శాఖ పగ్గాలను అందుకున్న స్మృతి ఇరానీ.. తన అధిపత్యాన్ని మళ్లి ప్రదర్శించారన్న అభియోగాలను మరోమారు ఎదుర్కొంటున్నారు. అమె అహాన్ని గౌరవించనందుకే తనను పదవిలోనుంచి తొలగించారని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) మాజీ చీఫ్ పహ్లజ్ నిహ్లాని అరోపించారు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ఒత్తిడి కారణంగానే తన పదవికి రాజీనామా చేశానని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇందు సర్కార్’ సినిమాకు తాను సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోనే అసలు వివాదం మొదలైందని అన్నారు. అప్పుడు, స్మృతి ఇరానీ తనకు ఫోన్ చేసి ఈ విషయమై ప్రశ్నించగా, ‘నేను సినిమా ట్రైబ్యునల్ ను అనుసరిస్తున్నాను’ అని చెప్పానని అన్నారు. దీంతో, ఆగ్రహించిన ఆమె, తనను బోర్డు నుంచి తొలగించేలా చేశారని ఆరోపించారు. అయితే, ‘ఇందు సర్కార్’ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, అయినప్పటికీ, తాను 70 కత్తిరింపులతో ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చానని చెప్పారు. దీంతో కేంద్రమంత్రికి సంబంధించిన మరో తెరవెనుక బాగోతం వెలుగుచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles