D Srinivas, son to join BJP camp? కాషాయ వనంలోకి డీఎస్ తనయుడు..?

Senior trs leader s son lauds pm modi creates ripples in ruling party

D.Srinivas, Senior TRS leader, younger son, D. Aravind, advertisements, PM Modi, TRS, congress, BJP, PM Modi, politics

An advertisement given by Srinivas’ younger son Aravind in some newspapers, on the occasion of Independence Day, praising Prime Minister Narendra Modi, creates ripples in ruling party

కాషాయ వనంలోకి డీఎస్ తనయుడు..?

Posted: 08/16/2017 04:33 PM IST
Senior trs leader s son lauds pm modi creates ripples in ruling party

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ మారుతున్నారన్న వార్తలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి తాను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఖండించారు. తాను ఏ పార్టీకి వెళ్లడం లేదని చెప్పిన తరువాత కూడా వార్తలు రావడం బాధ కలింగించాయని కూడా చెప్పారు. అయితే తాను పైపైన లేదు లేదని పార్టీ మారుతున్న వార్తలను ఖండిస్తున్నా.. గుట్టుగా ఇతర పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దమైయ్యిందన్న వాదనలకు తాజాగా బలం చేకూరుతుంది.

ఆయన పెద్ద కుమారుడు సంజయ్ రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించి.. నిజామాబాద్ పురపాలక సంఘం మేయర్ గా కూడా విధులు నిర్వహించిన అనంతరం తన తండ్రి ఓటమితో ఆయన రాజకీయాలలో మిన్నకుండిపోయారు. ఈ తరుణంలో డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్.. స్వాతంత్ర్య దినోత్సవాల రోజున ఒక్కసారిగా అందరికీ షాకిచ్ఛాడు. ఆయన ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన ఓ భారీ ప్రకటన తెలంగాణ రాజకీయవర్గాల్లో పెను సంచలనానికి దారి తీసింది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా 'జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి' అంటూ అరవింద్ ప్రకటన ఇచ్చారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలైన డీఎస్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా డీఎస్ ను కేసీఆర్ నియమించారు. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. అయితే, ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ లో డీఎస్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కొన్ని నెలల క్రితం డీఎస్ ప్రధాన అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరారు. తాజాగా అరవింద్ ప్రకటనతో... డీఎస్ కూడా బీజేపీలో చేరబోతున్నారా? అనే చర్చ మొదలైంది.

దీంతో మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఢీఎస్ తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ ఇచ్చిన ప్రకటనకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అతనేమీ చిన్న కుర్రాడు కాదని, ఆ ప్రకటన వెనుక అర్థమేంటో అరవింద్ నే అడగాలని తెలిపారు. అరవింద్ కూడా బీజేపీలో చేరతాడని తాను భావించడం లేదని, తాను టీఆర్ఎస్ ను వీడే అవకాశమే లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాను నడుస్తానని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D.Srinivas  Senior TRS leader  younger son  D. Aravind  advertisements  PM Modi  TRS  congress  BJP  PM Modi  politics  

Other Articles