Telugu Governor to Delhi for Vice Presidential Race

Telugu states governor again in vp race

Telugu States Governor, Governor Narasimhan, Narasimhan Delhi Tour, ESL Narasimhan, ESL Narasimhan Delhi, ESL Narasimhan Vice Presidential Race, ESL Narasimhan Modi, Narasimhan Rajnath Singh, Narasimhan VP ace, Narasimhan NDA Candidate

Telugu States Governor ESL Narasimhan Delhi Tour. Governor of the two Telugu states, is doing the rounds in Delhi as a candidate for the position of Vice-President, replacing the present incumbent Hamid Ansari who will complete his second five-year term in August this year.

గవర్నర్ ఢిల్లీ టూర్.. ఈసారి అదే న్యూసా?

Posted: 07/11/2017 01:59 PM IST
Telugu states governor again in vp race

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లాడు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం ఈ నెల 24వ తేదీన ముగియనుండటంతో అన్ని రాష్ర్టాల గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లకు గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొనబోతున్నాడు. అయతే ఆయన హస్తిన పర్యటన ఆంతర్యమేమిటో? అన్న హెడ్డింగ్ తో మీడియాలో ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

మూడు రోజుల ఈ పర్యటనలో అవకాశాన్ని బట్టి ప్రధాని నరేంద్రమోదీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కలిసి రెండు తెలుగు రాష్ర్టాల్లోని తాజా పరిస్థితుల గురించి వివరించే అవకాశం ఉంది. తరువాత ఆయన ఈనెల 14వ తేదీన చెన్త్నెకి వెళ్లి 15న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని సమాచారం. అయితే ఉపరాష్ట్రపతి పదవి రేసు కోసమే ఆయన అక్కడికి వెళ్లాడని, ఈ మేరకే కేంద్రంతో చర్చలు కూడా మొదలయ్యాయని వార్త పుట్టుకొచ్చింది.

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నరసింహన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు కొంతకాలంగా బలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ కేంద్ర మంత్రి కూడా రాజ్ భవన్ లో ఈ మేరకు నరసింహన్ తో చర్చలు జరిపినట్లు వార్తలు కూడా గుప్పుమన్నాయి. యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్ ను విభజన తరువాత కూడా కొనసాగించటం, పైగా పదవీ కాలాన్ని కూడా మూడుసార్లు పొడిగించటం విశేషమే.

పాక్ పై సర్జికల్ దాడుల సమయంలో తన అభిప్రాయాలను మోదీకి వెల్లడించటం, అన్నింటికి మించి నిప్పు ఉప్పులా ఉండే తెలుగు రాష్ట్రాల సీఎంలను హ్యాండిల్ చేయటం తదితర కారణాలు ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే ఎంత సానుకూలత ఉన్నప్పటికీ, ఆ మాత్రానికే ఉపరాష్ట్ర పదవి ఆయన కట్టబెడుతుందా? అని అడిగేవారు లేకపోలేదు. కారణమేదైనా ఇలా గుడ్డుమీద ఈకలు పీకే కథనాలు రావటం వెనుక రాజ్ భవన్ అధికారులే ఉన్నారన్నది మాత్రం స్పష్టం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor Narasimhan  Vice presidential Race  Delhi Tour  

Other Articles