YSRCP MLAs Fear with PK Suggestion to Jagan

Jagan ready to follow pk instructions

Election Strategist Prashant Kishor, Prashant Kishor, YSRCP MLAs PK, YSRCP Fears PK Decision, Prashant Kishor, PK Suggestions Jagan, PK Involve in YSRCP Activities,

Election Strategist Prashant Kishor suggest to YSRCP Chief Jagan. Replace 25 MLAs who are having mere chances to lost in 2019 elections.

జగన్ ఇక పీకేను ఫాలో కావటమే...

Posted: 07/07/2017 03:37 PM IST
Jagan ready to follow pk instructions

2019 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. జాతీయ స్థాయిలో పలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే సీన్ లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా తాము ఎలాంటి సర్వేలు చేయలేదని చెప్పుకొచ్చిన ఆయన, త్వరలో క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని త్వరలో పని మొదలుపెడతామని చెప్పాడు.

ఇదిలా ఉంటే అది అబద్ధం అన్న విషయం ఇప్పుడు ఓ వార్తతో వెల్లడవుతోంది. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ఇదివరకే సీక్రెట్ గా తెప్పించున్న పీకే(ప్రశాంత్ కిషోర్) దాని గురించి జగన్ వద్ద డిస్కషన్ కూడా జరిగినట్లు పార్టీ అంతర్గత వర్గాల లీకజీల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో పలువురికి ప్రజాదరణ లేదని, వారికి సీట్లు కేటాయిస్తే, గెలిచే అవకాశాలు ఉండవని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేశాడంట. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిందేనని సూచన కూడా చేశాడంట.

గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను ఇవ్వడం వల్ల వైకాపా నష్టపోయిందని, ఈ దఫా అలా జరుగకుండా చూసుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైకాపాలో ఉండగా, వారిలో దాదాపు 25 మంది పేర్లను వెల్లడించిన ఆయన, వారిని దూరం పెట్టాలని పేర్కొన్నారని సమాచారం. ఇక ఎవరి పేర్లున్నాయన్న విషయమై చర్చ హల్ చల్ చేస్తుండగా, చాలామంది ఎమ్మెల్యేలకు ప్రజాదరణ గత ఎన్నికలతో పోలిస్తే, 2 నుంచి 10 శాతం వరకూ తగ్గినట్టు పీకే టీమ్ చేసిన రహస్య సర్వేలో తేలినట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీ తరువాత పార్టీలో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఓవైపు ఆ పాతిక మంది ఎవరా అన్న గుబులు నేతల్లో పట్టుకుంటే.. కొత్తగా తమకు అవకాశం ఇస్తారేమో అని ఆశావాదులు ఆత్రుతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Prashant Kishor  YS Jagan  

Other Articles