Reason Behind IYR Krishna Rao sharing anti-TDP posts

Chandrababu quick reaction on iyr krishna rao ousting

Brahmin Corporation Chairman, AP Ex CS, IYR Krishna Rao, IYR Krishna Rao MLC, IYR Krishna Rao Chandrababu Naidu, IYR Krishna Rao Press Meet, IYR Krishna Rao Expecting MLC, Why IYR Krishna Rao Sharing Anti Posts, IYR Krishna Rao Real Reason, IYR Krishna Rao, IYR Disappoint MLC Seat

Brahmin Corporation Chairman IYR Krishna Rao Sacked. Ex-CS stirs controversy by questing govt's decisions.

ఐవైఆర్ తొలగింపు.. అసలేం జరిగిందంటే...

Posted: 06/20/2017 04:20 PM IST
Chandrababu quick reaction on iyr krishna rao ousting

కేవలం 24 గంటలు కూడా గడవక ముందే ఫేస్ బుక్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేశాడన్న ఆరోపణలపై ఐవైఆర్ కృష్ణారావును బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. చీఫ్ సెక్రటరీ పని చేసిన అనుభవం, పైగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నడిపిన ఐవైఆర్ అసలు ఎందుకు ఇలాంటి పనులు చేశాడన్న ప్రశ్నలు తలెత్తడం సహజమే. కానీ, దీనికి ముందే పెద్ద వ్యవహారమే నడిచినట్లు ఇప్పుడు తెలుస్తోంది.

సివిల్ సర్వెంట్ గా పదవీ విరమణ చేశాక ఐవైఆర్ కు నామినేటెడ్ పోస్టు బ్రాహ్మిణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏకపక్షంగా కట్టబెట్టింది ప్రభుత్వం. అయితే అప్పటికే ఎమ్మెల్సీ సీటును ఆశించిన ఆయన పలు దఫాలుగా చంద్రబాబుతో ఈ విషయం గురించి చర్చిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆమధ్య జరిగిన ఎమ్మెల్సీ రేసులో ఆయన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకోవటం, ఈ క్రమంలో ఆరు నెలలుగా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తుండటం జరుగుతోంది.

కానీ, తెలుగు దేశం అధినేత నుంచి ఎటువంటి సానుకూలత లేకపోవటంతో విసిగి వేసారిన ఇలా వ్యతిరేక చర్యలకు దిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తానే స్వయంగా బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అడిగి మరీ తీసుకున్నానని, ప్రత్యక్ష రాజకీయాలకు తనకు ఇష్టం లేదని చెబుతున్నప్పటికీ, ఆ పదవి విషయంలో ఆయనకు అసంతృప్తి ఉండటం మూలంగానే ఇలా వ్యతిరేక చేష్టలు చేయటం, అది బాబుకు ఆగ్రహం తెప్పించటంతో, టీడీపీ అభిమానుల నుంచి విజ్నప్తులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆయన పదవిని పీకేశారని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IYR Krishna Rao  Chandrababu Naidu  

Other Articles