Roja warned by Party Chief YS Jagan Mohan Reddy

Ysrcp chief jagan warn mla roja

Roja, Roja Jagan, Jagan Warn Roja, Home Minister Roja Jagan Warn, Jagan Warn Home Minister Roja, Roja Skip Save Vizag, Roja Skip Maha Dharna, Roja YSRCP Clash, Roja Upset Jagan Warn

YSRCP Chief YS Jagan Mohan Reddy Warned MLA Roja. Roja allegations on Govt at Tirumala Shiv Sena fired at her. Also she mentioned herself as future Home Minister.

ఫైర్ బ్రాండ్ కు జగన్ గట్టి వార్నింగ్... ఆ కామెంట్లకేనా?

Posted: 06/22/2017 03:58 PM IST
Ysrcp chief jagan warn mla roja

ప్రతిపక్ష వైఎస్సార్పీపీ బలమైన మహిళా నేతగా, ఫైర్ బ్రాండ్ గా పేరుబడ్డ రోజాకు కష్టాలు మొదలయ్యాయా? ప్రతీరోజూ మీడియాలో కనిపించాలనే ఆమె తాపత్రయం ఇరకాటంలో నెడుతుందా?. వైజాగ్ లో అవినీతి కుంభకోణంపై కీలకంగా నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టడంలో ఆంతర్యం ఏంటి? వీటన్నింటిని మేళవించి కొత్త కారణాలు అన్వేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇవ్వటంతోనే మనస్థాపం చెంది ఆమె రాలేదని చెప్పుకుంటున్నారు.

గతంలో అసెంబ్లీలో రోజా ప్రవర్తించిన తీరు వల్ల ప్రభుత్వంపై దాడి చేయడానికి అవకాశాలు లేకుండా పోయాయని మండిపడ్డ జగన్ ఇప్పుడు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి లోనైయ్యాడంట. రోజా వ్యవహారశైలి పార్టీకే కాదు, జగన్ కు ఇబ్బందిని కలిగించాయని, ఈ నేపథ్యంలో ఆమెను పిలిపించుకుని మరీ క్లాస్ పీకారని సమాచారం. ఇంకోపక్క వైసీపీ అధికారంలోకి వస్తే, తానే హోం మంత్రిని అంటూ రోజా ప్రచారం చేస్తుందన్న వాదన ఒకటి ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని తీరు మార్చుకోవాలని, లేకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది.

గతంలో వేటు సమయంలోనే జగన్ ఆమె సున్నితంగా మందలించగా, ఆ మధ్య కొంత కాలం మౌనంగా ఉన్న రోజా, మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతుంది. ఇదిగాక పవిత్రమైన తిరుమల కొండపై కూడా రోజా రాజకీయ విమర్శలకు దిగుతుండటం, శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయటం, చివరకు పంచాయితీ జగన్ దృష్టికి చేరిందంట. అదే సమయంలో నియెజకవర్గంలో రోజా సరిగ్గా ఉండటం లేదన్న ఫిర్యాదులు కూడా అందటం జగన్ కు చికాకు తెప్పించనట్లు చెబుతున్నారు. తనకు తోచినట్లు కాకుండా పార్టీ సూచించిన విధంగా మాట్లాడాలంటూ రోజాకు జగన్ సూచించినట్టు సమాచారం. జగన్ మందలించారన్న వార్తలో నిజమెంతో తెలీదుగానీ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉండి ఉండవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  MLA Roja  Warning  

Other Articles