KCR and Chandrababu Naidu silence on Amit Shah Tour

Amit shah tour telugu cms silent

Amit Shah Tour, Amit Shah Telugu States Tour, KCR Ami Shah Tour, Telugu States CMs, KCR Ignore Anit Shah, Amit Shah Andhra Pradesh, Amit Shah Slam KCR, Amit Shah Slam Chandrababu, Amit Shah ignore

BJP National President Amit Shah tour in Telugu states. Telangana and Andhra Pradesh state CMs not reacted to allegations.

అమిత్ షా టూర్.. ఇద్దరు చంద్రుళ్ల సైలెన్స్

Posted: 05/23/2017 04:13 PM IST
Amit shah tour telugu cms silent

దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంతో పాగా వేసేందుకు కమలనాథుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగటం చూశాం. ముందుగా తెలంగాణలో షా పర్యటన నిర్విఘ్నంగా కొనసాగుతుండంగా గులాబీ దళాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో బీజేపీపై పన్నెత్తి మాట కూడా నోరు జారొద్దంటూ ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశించటం తెలిసిందే. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉండటంతో ఈ మాత్రం సమయం చాలూ తాము బలపడటానికి అన్న భావన బీజేపీలో నెలకొంది. మరి ఈ పర్యటన నేపథ్యంలో విమర్శలు చేయకుండా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు కిక్కురుమనకుండా ఉన్నాయి అన్నది ఓ రీల్ వేసుకుంటే...

టీడీపీ లాగా ఎన్‌డీఏలో టీఆర్ఎస్ భాగస్వామి కాకపోయినప్పటికీ బీజేపీతో టీఆర్ఎస్ సఖ్యతగానే ఉంటోంది. కేసీఆర్, ప్రధాని మోదీ మధ్య కూడా సంప్రదింపులు బాగానే జరుగుతూ ఉంటాయి. అది కాక కేంద్ర నుంచి ఈ రెండు ప్రభుత్వాలకు సాయం అందుతుండగా, ఇంకా అవసరం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నోరు జారి కేంద్రం దృష్టిలో చెడు కాకూడదనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో షా పర్యటన వల్ల ఇద్దరు చంద్రుళ్లు తమ పార్టీలకు వచ్చిన నష్టమేమీ లేదని విశ్లేషించుకుంటున్నారంట.

ప్రభుత్వాలపై విరుచుకుపడ్డప్పటికీ అమిత్ షాపై అప్పుడే ఎటువంటి విమర్శలకు దిగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు సూచించగా, కేశినేని కామెంట్లతో రగిలిన ఆజ్యాన్ని చల్లార్చే పనిలో బాబు బిజీగా ఉన్నాడు. తక్షణం స్పందించి ఏది పడితే అది మాట్లాడి ఇరకాటంలో పడవేయొద్దంటూ నేతలకు కబురు వెళ్లినట్టు తెలుస్తోంది. అంతలా అవరమైతే పర్యటన ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలను సమీక్షించుకున్నాకే స్పందించాలని ఇద్దరు ఒకే రకమైన సారాంశాన్ని అందజేశారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Telugu States Tour  Chandrababu Naidu  

Other Articles