will Jagan and Pawan Kalyan share Congress stage కాంగ్రేస్ వేదికగా కలవనున్న పవన్.. జగన్.?

Will ys jagan and pawan kalyan to share congress stage for andhra pradesh special status

YS Jagan Pawan Kalyan to Join Hands, jagan pawan to join hands, pawan jagan to share congress stage, pawan kalyan ys jagan to join hands, With Congress For Special Status, YSRCP, Jana Sena, Jagan, Pawan Kalyan, Congress, Special Status, Andhra Pradesh

Will YSRCP president Jagan and Jana Sena president Pawan Kalyan to share Congress stage demanding Special Status for Andhra Pradesh as promised in state bifurfication bill.

కాంగ్రేస్ వేదికగా కలవనున్న పవన్.. జగన్.?

Posted: 06/03/2017 01:08 PM IST
Will ys jagan and pawan kalyan to share congress stage for andhra pradesh special status

గత ఎన్నికలకు మందు కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో అన్యాయం చేసిందని ఓట్లు వేసుకున్న పార్టీలు.. తాము అధికారంలోకి వస్తేనే ఆన్ని విధాలు అన్యాయానికి గురైన అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువచ్చి న్యాయం చేస్తామన్న పార్టీలు మాటమార్చి..  హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తూ ఇప్పటికే పలు వేదికల సాక్షిగా నిలదీసిన ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఒంటరిగా పోరాడుతారా..? లేక జతకలుస్తారా..?

గత ఎన్నికలలో బీజేపికి దేశవ్యాప్తంగా వచ్చిన మోడీ మానియా ఇటు రాష్ట్రంలో కూడా కొంతమేరకు వీచబట్టి.. వారితో కలసి ఎన్నికలకు వెళ్లిన టీడీపి అధికారంలోకి వచ్చిందని, దీనికి తోడు పవన్ కల్యాన్ ప్రచారం కూడా టీడీపి విజయానికి దోహదపడింది. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికార పార్టీతో మైత్రిబంధం కలిగివున్నా రానున్న ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటన్న విషయం అప్పుడే తెలుస్తుందని.. అంుటన్నాయి వైసీవీ వర్గాలు. ప్రత్యోక హోదాను ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. పోలవరం అవినీతిని కప్పిపుచ్చేందు కోసం టీడీపి ప్రయత్నిస్తుందని, అయితే గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ బాట ఎటువైపు..? ప్రత్యేక హోదాపై కేవలం మాటలేనా..? లేక కలసికట్టుగా ముందుకు సాగుతారా..?

ఈ విషయం తెలియాలంటే అదివారం వరకు వేచిచూడాల్సిందే. ఎందుకంటే ప్రత్యేక హోదా రాష్ట్రప్రజల హక్కు అని, దానిని పునర్విభజన బిల్లులో అప్పటి ప్రభుత్వాలు పెట్టాయని, రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన అంశాలన్నింటినీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించాలని, వాటన్నింటినీ ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మలు పర్చాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం అధివారం ప్రత్యేక హోదా భరోసా సభ పేరిట గుంటూరులో సభ నిర్వహిస్తోంది. అస్తుల పంపకాలు చేస్తారు కానీ ప్రత్యేక హోదా కల్పించరా.. అని నిలదీయనున్నారు. ఈ సభకు అన్ని పార్టీల నుంచి కలసివచ్చే నేతలను స్వాగతించారు.

దీంతో పవన్; జగన్ ఇదర్దూ ఇన్నాళ్లు వేర్వేరుగా ప్రజల్లోకి వెళ్లారే తప్ప.. ఇప్పటి వరకు ఒకే వేదికను పంచుకోలేదు. 2019 ఎన్నికల్లో ముఖ్యభూమిక పోషించనున్నారని భావిస్తున్న కీలక పార్టీల అధినేతలైన జగన్ పవన్ లు కాంగ్రెస్ వేదికను పంచుకోనున్నారు. ఇద్దరూ ఇంతవరకు కనీసం ఎదురుపడిన సందర్బాలు కూడా లేవు. అయితే జగన్ పార్టీ అన్నా, ఆ పార్టీ నేతలన్నా తనకు గౌరవమని జనసేనాని పవన్ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపిపై మాత్రం పవన్ నిప్పులు చెరిగారు. ఇటు టీడీపీ ఎంపీలను అదేస్థాయిలో విమర్శించిన పవన్.. సొంత వ్యాపారాలు కొంత మానుకుని గెలిచినందుకైనా కనీసం ప్రజల రుణం తీర్చుకునే పనిలో భాగంగా ప్రత్యేక హోదా కోసం పోరాడండీ అంటూ పిలుపును కూడా ఇచ్చారు.

బీజేపీకి సాగిలపడిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాను మర్చిపోయి.. హోదా కాదు ప్యాకేజీ ముఖ్యమని.. హోదాతో వచ్చే ప్రతీ లాభం ప్యాకేజీతో తీసుకువస్తానని మాట మార్చారు. ఇదే విషయాన్ని గత ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదంటూ అక్కడక్కడా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో పవన్ కల్యాన్.. వెఎస్ జగన్ లు ఇద్దరూ కలసి రాజకీయ వేదికను పంచుకుంటే ఆ వేదిక రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో సందేహమే లేదు. కానీ అది జరుగుతుందా..? ఇద్దరు అధినేతలు ప్రత్యేక హోదా సభకు వస్తారా..? అంటే అనుమానాలు మా్రం వెన్నాడుతున్నాయి.

తనను కార్నర్ చేసిన కాంగ్రెస్ పిలిస్తే జగన్ వెళ్తారా అన్నదీ సందేహమే. ఇక అన్న చిరంజీవి కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక విమర్శలు గుప్పించిన పవన్ కూడా దూరంగానే ఉంటారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇద్దరు పార్టీ అధినాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఏ జాతీయ పార్టీ ఇస్తానని ముందుకు వస్తే ఆ పార్టీతో జతకట్టేందుకు తాము సిద్దం అని వేర్వేరు వేదికపై ఇప్పటికే మాటఇచ్చారు. ఈ క్రమంలో ఎన్డీఏ ఇవ్వలేమని స్పష్టం చేయగా, తాము ఇచ్చిన హామీని అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు వస్తాయా.. లేదా.. పవన్, జగన్ లు హాజరవుతారా..? లేదా..? అన్న అంశంలో క్లారిటీ మాత్రం రావడంలేదు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో 24 గంటలు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Jana Sena  Jagan  Pawan Kalyan  Congress  Special Status  Andhra Pradesh  

Other Articles