KCR to Play Key Role in Presidential Election

Telangana cm kcr could shape presidential election result

Telangana, KCRPresidential Elections, KCR BJP or Congress, KCR President Elections, Presidential Election TRS Votes, KCR Key Role, KCR Electoral College, Telangana CM KCR, KCR Congress, KCR Sonia Gandhi President Elections, TRS BJP Presidential Elections

In Election For President, Telangana's KCR Could Shape Result. TRS, which has 17 MPs and 82 MLAs, commands a vote strength of 22,048 in the Presidential election.

రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ దే కీ రోల్?

Posted: 05/05/2017 11:33 AM IST
Telangana cm kcr could shape presidential election result

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదటి నుంచే కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే కొరుకుంటు ఉంటాడు. దేశంలోనే బలమైన ముఖ్యమంత్రిగా పేరున్నప్పటికీ కేంద్రం సాయం కూడా కీలకం అనే ఆలోచన ఉండటమే అందుకు కారణం. అందుకే నోట్ల రద్దు, జీఎస్టీ కోసం హడావుడిగా అసెంబ్లీని హాజరుపరిచి బిల్లుకు మద్ధతు ఇవ్వటం, సహా పలు అంశాలతో బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూనే ఉన్నాడు. అయితే రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మారుతున్న పరిస్థితులను రాజకీయ విశ్లేషకులు ఆసక్తి పరిశీలిస్తున్నారు.

నిజానికి ఎన్డీయే ప్రభుత్వానికి ప్రత్యక్ష మద్ధతు ఇవ్వకపోయిన పరోక్షంగా మాత్రం వాళ్లు తీసుకునే ఏ నిర్ణయానికైనా టీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తూనే వస్తోంది. ఆ మధ్య కేబినెట్ లో తమ ఎంపీలకు పదవులు ఇస్తారన్న కండిషన్ మీద ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ అంగీకరించాడనే పుకారు రేగింది. కేంద్రంలోని మోదీ సర్కారుతో స్నేహపూర్వకంగా ఉంటున్నామన్న సంకేతాలను పలుమార్లు పంపాడు కూడా. కానీ, ఇప్పుడు మిర్చి పెట్టిన ఘాటుతో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య కదిలిస్తే మాటల తుటాలు పేలుతున్నాయి.

స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ రైతుల కష్టాలను తీర్చేందుకు టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదు కాబట్టే తాము కల్పించుకున్నామని వ్యాఖ్యానించటం, ఇక్కడ పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని టీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు ముందులా ఉన్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీ నిలిపే అభ్యర్థికి తాము మద్దతిచ్చేది లేదని టీఆర్ఎస్ చెప్పడం లేదు. అలాగని ఎన్డీయే నిలిపే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆ పార్టీ సీనియర్ నేత పీ రాజేశ్వర్ రెడ్డి స్వయంగా వెల్లడించడం గమనార్హం.

బీజేపీ నిలిపే అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో, మరో అభ్యర్థి పేరును తెరపైకి తేవాలన్నది సోనియా అభిప్రాయం. ఆ సమయంలో సోనియాతో  చాలా దగ్గరి సంబంధాలే ఉన్న కేసీఆర్ ఆమె కోరితే మద్దతు ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.  కాగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం, విపక్షాలను పక్కన బెడితే, తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ 25 వేల ఓట్ల దూరంలో ఉంది. టీఆర్ఎస్ కు ఉన్న బలం 22 వేల ఓట్లు.. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ డెసిషన్ మేకర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఎవరికి మద్ధతు ఇస్తాడన్నది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  President Elections  

Other Articles