శశికళను మరిచిపోతున్నారా? జైల్లో ఎంతటి లగ్జరీ లైఫ్ అంటే... | Why AIADMK not appeal petition on Sasikala's conviction.

Sasikala fire on ministers who meet her in jail

Sasikala Natarajan, Sasikala Natarajan Jail Life, Sasikala Natarajan Prison, Sasikala Natarajan Jail Facilities, Sasikala AIADMK Ministers, Sasikala Natarajan Fire, Sasikala Natarajan Serious, Sasikala Natarajan Conviction Review Petition, Sasikala Disproportionate Assets Case

Sasikala Natarajan fire on Ministers who met her in jail. Jail Officials explained full list of facilities what Sasikala enjoys in jail. The DG prisons replied to the RTI query stating that apart from a television set she does not enjoy any other special facilities.

శశికళ ప్రస్టేషన్ మంత్రుల మీద చూపిందా?

Posted: 03/02/2017 11:37 AM IST
Sasikala fire on ministers who meet her in jail

అక్రమాస్తుల కేసులో దోషిగా సుప్రీం కోర్టు ధర్మాసనం నుంచి నిర్ధారణ కావటంతో ప్రస్తుతం బెంగళూరు లోని పరప్పణ అగ్రహర జైలులో శశికళ నటరాజన్ శిక్ష అనుభవిస్తోంది. అయినప్పటికీ పొరుగు రాష్ట్రం నుంచే తమిళనాడు రాజకీయాలను శాసించే క్రమంలో ఆమెకు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. జైల్లో అది కూడా ఓ పార్టీకి అధినేత కావటంతో ప్రత్యేకంగా టీవీ సౌకర్యం కల్పించామే తప్ప మరేయితర సదుపాయాలు ఆమెకు లేవని జైలు అధికారులు ఆర్టీఐ కింద దాఖలైన ఓ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారు.

అంతేకాదు ఆమె చెన్నై జైలుకు మార్పించాలన్న విజ్నప్తి ఇప్పటిదాకా చేయలేదని వారు చెబుతున్నారు. ఆ లెక్కన సాధారణ ఖైదీలాగానే ఆమె జీవితం గడుపుతోందని అర్థమౌతోందని స్పష్టమైంది. కనీసం మంచం, పరుపు లాంటివి కూడా లేకుండా కటిక నేలపై దుప్పటితో ఆమె కాలం వెళ్లదీస్తుందంట. ఏసీ, హీటర్ లాంటి లగ్జరీ సదుపాయాలు లేకుండా తోటి ఖైదీలతో సమానంగా శశికి ట్రీట్ మెంట్ జరుగుతోంది.   

అయితే దినకరన్ తర్వాత ఆమెను జైల్లో కలిసిన ముగ్గురు మంత్రులకు ‘చిన్నమ్మ’ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎవరికి వారే బిజీగా ఉంటూ తన గురించి కొంచెం కూడా ఆలోచించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందంట. తన కేసులో అప్పీలుకు వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. పార్టీ పదవిపై ఎన్నికల సంఘం పంపిన నోటీసుకు సంజాయిషీ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు వహించారంటూ మండిపడినట్లు సమాచారం.

అధికారంలో ఉన్నామన్న మాటే తప్ప తనను గట్టెక్కించే విషయంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదా? అంటూ ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తెలియక మంత్రులు సెంగొట్టయ్యన్, కామరాజ్, దిండుగల్ శ్రీనివాసన్ నీళ్లు నమిలారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఆమెకు ఎదురుతిరిగితే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందన్న భావనలో ఉన్న ఆమె పరిస్థితిని చక్కదిద్దాలంటూ పరోక్షంగా మన్నార్ గుడి మాఫియాకు సంకేతాలు పంపుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala Natarajan  Parappana Agrahara Jail  Disproportionate Assets Case  

Other Articles