చంద్రబాబును మళ్లీ అంటిన అవినీతి మకిలీ.. chandrababu name flashes again in corruption dairy

Chandrababu name flashes again in corruption dairy

sahara diaries, kickbacks, bribe, corruption, cash for vote, note for vote, horse riding, tehelka, heritage, vara prasad, sahara, chandrababu naidu, andhra pradesh

despite claiming himself as anti corruptionist, Andhra Pradesh Chief Minister chandrababu name flashes in sahara dairy

చంద్రబాబును మళ్లీ అంటిన అవినీతి మకిలీ..

Posted: 01/12/2017 03:20 PM IST
Chandrababu name flashes again in corruption dairy

దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న బిర్లా సహారా డైరీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కూడా వుండటం కలకలం రేపుతుంది. చంద్రబాబు తనకు తాను అత్యంత నీతివంతమైన వ్యక్తినని, నిజాయితీకి తాను చెరగని చిరునామా అని ప్రకటించుకున్నా.. ఏనాడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బహిరంగ సభలలో ప్రజల ఎదుట ప్రసంగాలు గుప్పించినా.. అయనను పట్టిన అవినీతి మకిలీలు మాత్రం అంత తొందరగా వీడటం లేదు. అవినీతి రహిత్యమైన నేతను అనేక సందర్భాలలో అదే మెడకు బిగుసుకుంటుంది. అనుభవశాలి కాబట్టి వాటి నుంచి త్వరగానే అయన బయటపడుతున్నారన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో లేకపోలేదు.

అయన తొలిసారిగా సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే అవినీతి మకిలి ఆయనను అంటుకుంది. ఈ మేరకు తెహల్కా డాట్ కామ్ అరోజుల్లోనే ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి తన పయనాన్ని ప్రారంభించి.. రెండు వేల కోట్ల రూపాయల అస్తులను కూడగట్టుకున్నారని తెహల్కా తన కథనంలో పేర్కోంది. అయితే ఈ కథనంపై హుటాహుటిన స్పందిచన చంద్రబాబు దానిని తన పరపతితో తీయించాడని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ అంశం పెను సంచలనంగా కూడా మరింది. అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంతకు ముందు పి.జనార్థన్ రెడ్డీలు కూడా చంద్రబాబును ఈ అంశాలపై ప్రశ్నించిన సందర్బాలు వున్నాయి.

అప్పటి నుంచి చంద్రబాబుకు అవినీతికి వున్న బంధం బలపడిందన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి.ఇక అక్కడి నుంచి చంద్రబాబు తన పేరు బయటకు రాకుండా ఏకంగా పావులు కదుపుతూ.. ఎవరికీ అనుమానం రాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తుల సహకారంతో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడని కూడా వార్తలు వినబడుతూ వచ్చాయి. ఆ తరువాత రెండో పర్యాయం కూడా సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారని, తనపై కానీ, తన వ్యక్తిగత జీవితంపై కానీ ఎలాంటి అవినీతి మకిలి లేకుండా జాగ్రత్త పడ్డారు.

పైకి పార్టీ నేతలంటే ఎంతటి విశ్వాసాన్ని కనబర్చినా.. తన నీడను కూడా తాను నమ్మని వ్యక్తి చంద్రబాబు అని, స్వయంగా అతని రాజకీయ సమకాలికుడు, స్నేహితుడైన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వాటికి ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితులుల ఉత్పన్నం అవుతుండగా, సరిగ్గా అలాంటి పరిణామాలే వరుసగా ఎదుర్కోంటున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన తరువాత సరిగ్గా అలాంటి వ్యాఖ్యలకు నిదర్శనంగానే పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.

నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మరోమారు తన అవినీతి వ్యూహంతో తెలంగాణలో చక్రం తిప్పాలని పథకాన్ని రచించే క్రమంలో ఆయన పరిస్థితి కుడిదిలో పడిన ఎలుకలా మారిందన్న వార్తులు తెరపైకి వచ్చాయి. తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో పార్టీ నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఆయననే కాదు ఈ కేసులో అసులు వీళ్లు టీడీపీ నేతలేనా అన్న అనుమానాలు కలిగే వ్యక్తులు కూడా ఈ కేసులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఇదే చంద్రబాబుకు తమ పార్టీ నేతలపైవున్న నమ్మకానికి నిదర్శనమని పలువురు పార్టీ నేతలు కూడా వ్యంగంగా విమర్శించారు.

అయితే ఈ కేసులో ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు కూడా ఫోన్ ద్వారా మాట్లాడారని అరోపణలు వున్నాయి. మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ.. అంటూ అయన స్టీఫెన్ సన్ తో మాట్లాడిన సంభాషణ.. అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో హల్ చల్ చేసింది. అయితే అది ఆయన గోంతేనా.. కాదా అన్న విషయాన్ని తెల్చాల్సిన అధికారులు దానిని అటకెక్కించారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక స్టీఫెన్ సన్ తో ఈ డీల్ ను కుదర్చిన వాళ్ల జాబితా, మాట్లాడింది ఎవరెవరు అన్న జాబితాను అప్పట్లో విడుదల చేసిన ఏసిబీ చెంతాడంత వుందని కూడా పేర్కోంది. ఇక ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిపోయింది.

ఆ తరువాత పనామా పేపర్లు లీక్ కావడం.. వాటిలో మన దేశానికి చెందిన అక్రమార్కుల. నల్లధన కుబేరులు పేర్లు బయటపడుతుండటంతో.. యావత్ దేశవ్యాప్తంగా ఇవి సంచలనాలను రగిలించాయి. అయితే ఇక్కడ కూడా చంద్రబాబుకు అవినీతి మకిలీ అంటింది. ఆయన కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ వరప్రసాద్ పేరు మూడు పర్యాయాలు పనామా పేపర్లలో ప్రస్తావన రావడం కూడా చంద్రబాబును ఇబ్బందికర పరిస్తితు్లోకి నెట్టింది. దానిపై ఆయన వివరణ ఇచ్చినా.. విపక్షాల నుంచి విమర్శలను మాత్రం అపలేకపోయారు.

ఇక తాజాగా సహారా డైరరీ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వేదికగా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. చంద్రబాబుపై అరోపణలు చేశారు. బిర్లా-సహారా డైరీలో చంద్రబాబు పేరు కూడా ఉందని అరోపించారు. ఆయన కూడా సహారా నుంచి ముడుపులు పుచ్చుకున్నారని అరోపించారు. ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు తో పాటు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా వుండటం, దీనిపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా అరోపణలు సంధించిన నేపథ్యంలో ఈ డైరీ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కాగా, విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ పిటీషన్ పై తీర్పును వెల్లడిస్తూ..  ప్రముఖుల పేర్లతో కూడిన డైరీ బయటపడినంత మాత్రన దానిని పరిగణలోకి తీసుకోలేమని ప్రధాని మోడీతో పాటు అందరకీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ చంద్రబాబుకు మాత్రం మరోమారు అవినీతి మకిలీ అంటింది. నీతివంతుడని చెప్పుకునే వ్యక్తిపై సాక్షాత్తు సుప్రీంకోర్టులో అరోపణలు సంధించిన ప్రశాంత్ భూషన్ పై ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం, అసలు ఈ వ్యవహారం గురించి ఏమీ మాట్లాడకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles