శాతకర్ణి టాక్స్ రాయితీ తప్పేం లేదు కానీ... | Why AP exempt tax to Satakarni after Telangana.

Satakarni got tax exemption before ap

Gautamiputra Satakarni, Satakarni tax exemption, Criticism on Satakarni tax exemption, Andhra Pradesh Satakarni tax exemption, Chandrababu Satakarni tax exemption

Criticism on tax exemption to Gautamiputra Satakarni by Andhra Pradesh Govt. Chandra babu really misuse of public office for personal gain.

శాతకర్ణికి టాక్స్ రాయితీ ఇవ్వకూడదా?

Posted: 01/07/2017 04:24 PM IST
Satakarni got tax exemption before ap

తెలుగు వాడికి కూడా తెలియని ఓ చక్రవర్తి గురించి ప్రతిష్టాత్మకంగా సినిమా ఎంచుకున్నాడు నటసింహ బాలయ్య. అనుకున్నట్లుగానే మూడు నెలల్లో సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్. ముందు నుంచి అనుకున్నట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు టాక్స్ మినహాయింపు దొరికింది. స్పెషల్ షో ఆహ్మానం పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి ప్రత్యేక కృతజ్నతలు చెప్పటం చూశాం. అయితే దీనిపై ఇప్పుడు కొందరి వాదన మరోలా ఉంది. తమ ప్రభుత్వం అయినా ఏపీని ముందుగా సంప్రదించకుండానే బాలయ్య ముందుగా (అల్రెడీ ఇచ్చేస్తారు గనుక) తెలంగాణ ప్రభుత్వంను కలవటమే ఇక్కడ అసలు చర్చకు దారితీసింది.

చారిత్రక చిత్రం, పైగా తెలంగాణ గడ్డ మూలాలున్న రాజుపై సినిమా కాబట్టి కేసీఆర్ పన్ను మినహాయింపు ఇవ్వటం ఆశ్చర్యపరచలేదు. పైగా గతంలో రుద్రమదేవీ చిత్రానికి కూడా ఇలాగే ఇచ్చాడు కూడా. మరి చంద్రబాబు విషయంలో ఇక్కడ తేడా కొట్టేస్తోంది. రుద్రమదేవి విషయంలో గుణశేఖర్ కలిసి విజ్నప్తి చేసినా కూడా స్పందన లేని బాబు, ఇప్పుడు బావ సినిమాకు మాత్రమే ఇవ్వటం,పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిందన్నది ఆరోపణ.

అంతేకాదు ఓ సినిమా గురించి ఎటువంటి అంచనాలు లేకుండా, పైగా సినిమా చూడకుండానే టాక్స్ మినహాయింపు ఇవ్వటమే వివాదాస్పదమౌతోంది. తన కుటుంబ సభ్యుల చిత్ర ఫంక్షన్ లకు రెగ్యులర్ గా హాజరయ్యే ముఖ్యమంత్రి వర్యులు ఏ మూలానా ఇలా రాయితీలు ఇచ్చాడో చెప్పాల్సి అవసరం ఉండాల్సిందే. అయినా సొంత మనుషులు కాకపోయి ఉంటే ఇలాంటి బంఫరాఫర్లు దక్కేవా చెప్పండి? అలాగని శాతకర్ణి కి రాయితీ దక్కినందుకో, మరే చిత్రానికో దక్కలేదన్నది బాధకాదు. కానీ, పక్షపాతం లేకుండా సినిమాలను రాజకీయం చేసి లాభపడొద్దనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Andhra Pradesh  

Other Articles