ధోనీ రాజీనామా.. తెర వెనుక ఏం జరిగిందంటే... | Scene behind Dhoni resign as Captain.

Reason behind dhoni step down as captain

MS Dhoni, Captaincy, Dhoni quit captaincy, Dhoni resign the untold story, Team Dhoni Support, Dhoni as Player, Dhoni team member, Dhoni retirement

Mahendra Singh Dhoni behind resignation the untold story.

ధోనీ దిగిపోయాడా? దింపేశారా?

Posted: 01/06/2017 06:37 PM IST
Reason behind dhoni step down as captain

మహేంద్ర సింగ్ ధోనీ లైఫ్ అంతా సక్సెఫుల్ స్టోరీయే. రెండు ప్రపంచకప్ లు(వన్డే, టీ20), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ, టెస్ట్ లో ఏళ్లకు ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న నంబర్ వన్ ర్యాకింగ్. ఇవన్నీ అతని సార్థ్యంలోనే సాధ్యమయ్యాయి. తీవ్ర ఒత్తిడిలో కూడా కూల్ గా ఉంటూ పైగా ప్రయోగాలు చేస్తూ విజయం సాధించటం బహుశా క్రీడ చరిత్రలోనే ఒక్క మహేంద్రుడికే సాధ్యమయ్యింది.

అయితే ఎంత సక్సెఫుల్ కెరీర్ ఉన్నప్పటికీ ఏదో రోజు శుభం కార్డు పడాల్సిందే. కానీ, ధోనీ ఇలా హఠాత్తుగా కెప్టెన్సీ బాధ్యతలు వదులుకోవటం సరైందేనా, దాని వెనుక ఎలాంటి పరిణామాలు ఉన్నాయి. అసలేం జరిగింది ఓ సారి లోతుగా విశ్లేషితే... ఫామ్ లేమితోనే కాదు, ఎప్పుడు రిటైర్ అవుతారు అన్న మీడియా ప్రశ్నలతో కొంత కాలం మనోవేదనకు గురయ్యాడు ధోనీ. 

కట్ చేస్తే గత మ్యాచ్ ల్లో ధోనీ తన బ్యాట్ తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఆపై కట్ చేస్తే.. పగ్గాలు వదిలేస్తున్నట్లు తేల్చేశాడు. ఇంతకు తనకు తానుగా రాజీనామా చేశాడా? లేక ధోనీతో రాజీనామా చేయించారా? అన్న అనుమానాలు ఇప్పడు వ్యక్తమవుతున్నాయి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ధోనీకి ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఇప్పటికే టెస్టుల్లో జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. సభ్యలు కూడా అంతే బలమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఎప్పటికప్పుడు టీం మార్చిన వచ్చిన వాళ్లంతా తమ బ్యాట్ ఝుళిపించి పాత వాళ్లకి ఛాన్స్ లేకుండా చేసేస్తున్నారు.

మరోవైపు వన్డే టీం పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కీపర్ అవసరం తప్పించి, బ్యాటింగ్ ఆర్డర్ లో ఆ పొజిషనల్ సత్తా చాటేందుకు చాలా మంది యువ క్రీడాకారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అంతేకాక వరల్డ్ కప్ సన్నాహక జట్టు ఫ్యూచర్ కెప్టెన్ కోహ్లీకి అలవాటు కావాలంటే కనీసం ఆ మాత్రం సమయం అవసరం. ఈ సమయంలో ఆడినా, ఆడకపోయినా ధోనీకి మరో అవకాశంగా(ఆఖరి) ఛాంపియన్స్ ట్రోపీ ఇద్దామని బోర్డు భావించి ఉండొచ్చు. టెంపరరీ కెప్టెన్ గా వచ్చి కోహ్లీ పూర్తి స్థాయిలో టెస్ట్ సారథిగా స్థిరపడిపోయాడు. ఈ క్రమంలో వర్థమాన ఆటగాళ్లంతా కోహ్లీకి అనుకూలంగా మారారు.

చివరికి తన అండతో పైకొచ్చిన వాళ్లు కూడా ధోనీని పట్టించుకోకుండా పోయే స్థాయికి దిగజారారు. దీనికి తోడు ఫామ్ లేమి కొంతకాలం వేధించింది. ఆపై వచ్చినా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆశించలేదు. కాబట్టి ఈ సారి ఫెయిల్ అయితే కనుక ఇక అంతే. అదే జరిగితే కెప్టెన్ గా ఉండగానే అవమానకర రీతిలో టీం నుంచి నిష్క్రమించటమే కాదు, సరైన వీడ్కోలు కూడా లభించని సీనియర్ల జాబితాలో తాను చేరాల్సి వస్తుందేమోనని కంగారు పడ్డాడు. భవిష్యత్ నెమ్మదిగా ధోనీకి అర్థమైంది. ఇంకో వరల్డ్ కప్ దాకా కెప్టెన్ గా కాదు కదా, కనీసం ఆటగాడిగా కూడా కొనసాగటం కష్టమన్నా సంకేతాలు అందాయి.

వెంటనే చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కి ప్రపంచ కప్ సమరానికి జట్టు ఎలా సిద్ధం కావాలో విశదీకరించాడు. ఈ క్రమంలో తన అవసరం లేదన్న వాదనను గట్టిగా వినిపించి మరీ రాజీనామా నిర్ణయం ప్రకటించాడు. అంతేకానీ ధోనీ రాజీనామా ఉరుములు, మెరుపులు లేని వాన ఏ మాత్రం కాదు. అందుకే ద్రావిడ్ లాంటి దిగ్గజాలకు అది ఏ మాత్రం ఆశ్చర్యం అనిపించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Resignation  ODI captain  Reason Behind  

Other Articles