రజనీ రాజకీయాల్లో ‘కీ’ అవుతాడా? | Rajinikanth new party in Tamil Nadu politics.

Rajinikanth enters politics

Rajinikanth new party, Rajinikanth Tamil Nadu politics, Rajinikanth Modi, rajinikanth BJP alliance, Rajinikanth after Jayalalitha's death, Tamil Nadu political Crisis, Rajinikanth BJP politics

Rajinikanth's Elder Brother response on rajini's political entry and new party.

ఇక రాజకీయాలతో రజనీ రెచ్చిపోతాడా?

Posted: 12/12/2016 02:39 PM IST
Rajinikanth enters politics

తమిళనాట రాజకీయాల్లో అమ్మ శకం ముగిసింది. పురుషాధిక్యత రాజకీయాలకు చెక్ పెడుతూ ఒంటి చేత్తో తమిళనాడును శాసించింది జయలలిత. ఆమె నిష్క్రమణతో ప్రస్తుతం అక్కడి రాజకీయాలు చెల్లాచెదురు అవుతున్నాయి. మరి తమిళ తలైవా రజనీ కాంత్ రాజకీయ ఎంట్రీకి సరైన సమయం ఇదేనా? అవును.. ఇదే.. ఈ మాట అంటుంది కోట్లాది ఆయన అభిమానులు కాదు. రజనీని ఈ బురదలోకి దించనంటూ కామెంట్లు చేసిన స్వయానా ఆయన అన్నయ్య సత్యనారాయణరావు.

జయలలిత చనిపోవటంతో రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి దారులు క్లియర్ అయినట్లేనన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ జాతీయ మీడియాకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఏం చేప్పాడంటే... ‘‘ రజనీ రాజకీయ రంగప్రవేశానికి వంద శాతం ఇదే అనుకూలమైన సమయం. కానీ ఆ విషయంలో రజనీ తొందరపడడు. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంతో పూర్తవుతుంది. రజనీ కూడా రాజకీయాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాడు’’ అని తెలిపాడు.

మరి బీజేపీతో జత కడతారా? అన్న మరో ప్రశ్నకు.. అటువంటి ఆలోచనే లేదని, ఒకవేళ రజనీ పొలిటికల్ ఎంట్రీ జరిగితే మాత్రం అది ఖచ్ఛితంగా కొత్త పార్టీతోనేనని ఆయన తెలిపాడు. రాజకీయాల్లో వేరే వాళ్లని నమ్ముకోవటం అంత మూర్ఖమైన పని ఇంకోటి ఉండదని ఆయన వివరించాడు.


రజనీ-మోదీ దోస్తీ?
ప్రధాని మోదీ, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరికీ మంచి సానిహిత్యం ఉంది. 2014 ఏప్రిల్ లో మోదీ రజనీ ఇంటికి కూడా వెళ్లాడు. అయితే అది రాజకీయం కాదని, తన మంచి స్నేహితుడు, బాగోగులు కొరుకునేవాడు కావటంతోనే మోదీ తనను కలిశాడని రజనీ కవర్ చేసే యత్నం చేశాడు. ఇక రజనీ ట్వీట్టర్ ను పరిశీలిస్తే.. ఇప్పటిదాకా 40 ట్వీట్లు చేసిన రజనీ అందులో 16 రాజకీయాలకే సంబంధించినవి చేయగా, 5 మోదీని ఉద్దేశించి చేసినవే. రజనీ ఇలా ట్వీట్ చేయగానే, మోదీ కూడా యమ స్పీడ్ గా రెస్పాన్స్ ఇచ్చేవాడు. ఈ పరిణామాలు చూసిన ఎవరైనా వీరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో ఇట్టే చెప్పేయగలరు.

ఇక ఇప్పుడు కొత్త పార్టీ గురించి సత్యనారాయణ చెబుతున్నప్పటికీ, రజనీ ఆలోచన మాత్రం బీజేపీతో దోస్తీ అన్నదే అయి ఉండొచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకవేళ ధైర్యం చేసి సొంత పార్టీ పెట్టినా మెల్లి మెల్లిగా దానిని బీజేపీలో విలీనం చేయొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమన్నది వారి ఉద్దేశ్యం.


రజనీ వారికి కావాల్సిందే...

ఇంతకాలం జయ డామినేషన్ తో కొనసాగిన తమిళ రాజకీయాలను తమ హస్తగతం చేసుకోవటం కమలంకి చాలా అవసరం. ఉత్తరాది రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నప్పటికీ, ఇక్కడి రాజకీయాల్లో ( కర్ణాటక) తప్ప ఎక్కడా పూర్తి స్థాయి ఆధిక్యం ప్రదర్శించలేదు. అందుకే అల్లకల్లోలంగా ఉన్న సమయంలోనే తమిళనాడుపై పట్టుసాధించాలన్నది బీజేపీ ఫ్లాన్. హిందుతత్వ మూలాలున్న బీజేపీకి బ్రహ్మణ ద్రావిడ రాజకీయాలకు ఆదరణ ఎక్కువగా ఉన్న అక్కడ తిష్ఠ వేయాలంటే ఓ ఆధారం కావాల్సిందే. అందుకే తంబీల ఆరాధ్య దైరవంగా తలైవా కాషాయం పార్టీకి ఖచ్ఛితంగా అవసరం.

కింగ్ మేకర్ అయ్యే సీన్ ఉందా?

రజనీకాంత్ కి రాజకీయాలకు మధ్య సంబంధం ఇప్పటిదాకా చాలా విచిత్రంగా సాగుతూ వస్తోంది. 1990లో పీవీ నరసింహరావు ప్రధాని అయినప్పుడు స్వయంగా వెళ్లి కలిశాడు రజనీ. ఆపై 1996లో కాంగ్రెస్-జయ దోస్తీతో చిర్రెత్తుకొచ్చి డీఎంకేకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్న రజనీ జయపై చేసిన వ్యాఖ్యలు ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అంతకు ముందు అధికారంలో ఉన్న అమ్మ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తాను ఓడిపోవటమే కాకుండా, కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకుందంటే దానికి ముమ్మాటికీ రజనీ(వ్యాఖ్యలు) కూడా కారణమే.

కానీ, మళ్లీ అధికారంలోకి జయ వచ్చాక రజనీ రాజకీయాల వైపే చూడలేదు. ఇలాంటి సమయంలో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రజనీ లొంగిపోతాడనుకోవటం అనుమానమే. అనూహ్యంగా సినిమాలకు చెక్ పెడుతూ రాజకీయ ఆరంగ్రేటంతో రజనీ తత్తరపాటు నిర్ణయం తీసుకోడనే విశ్లేషకుల మాట. చూద్దాం రేపు ఏం జరుగుతుందో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu Politics  Rajinikanth  BJP alliance or New Party  

Other Articles