పాతిక కోట్ల బంగారం కొన్న హీరో వైఫ్.. గోల్డ్ స్కాంలో ఛానెల్ అధిపతి కూడా.. | Star Celebrities involvement in Gold Purchasing Scam in Hyderabad.

Celebrities involvement in hyderabad gold scam

Star Hero Wife Gold, Telugu Media head gold scam, Demonetization gold purchasing in Hyderabad, Gold Purchasing Scam in Hyderabad, Celebs involved in Gold Scam, Star hero black money

Star Hero Wife and Media Head convert their black money into White through Gold Purchasing In Hyderabad on demonetization day.

గోల్డ్ స్కాంలో హీరో వైఫ్.. మీడియా అధినేత

Posted: 12/08/2016 10:13 AM IST
Celebrities involvement in hyderabad gold scam

నల్ల కుబేరుల భరతం పట్టేందుకు దేశ ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు సంచలన నిర్ణయం అభినందనీయమే. అయితే ఇది ఆర్థిక పురొగతికి సహకరించే విషయం పక్కనబెడితే ఎంత మేర ముఖ్య లక్ష్యాన్ని చేరుకుందన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐ రోజువారీ లెక్క వెలువడిన తర్వాతే రాత్రి పూట నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వెసులు బాటు లేని సమయం చూసి మోదీ జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటన చేశాడు. అర్థరాత్రి నుంచే నోట్లు చెల్లవని చెబుతూ నోట్లను మార్చేందుకు షరతులు కూడా పెట్టేసింది బ్యాంకు. అయితే ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా వదలని నల్ల బాబులు వైట్ లోకి ఎలా మార్చేసుకున్నారన్న విషయం ఇప్పడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

అంత పెద్ద మొత్తంలో సొమ్ము మారాలంటే ఉన్న ఏకైక మార్గం బంగారం కొనుగోలును ఆశ్రయించారు. ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 1000 కోట్లకు పైగా బంగారం విక్రయించేశారు వ్యాపారస్థులు. ముఖ్యంగా ఐదు ప్రముఖ దుకాణాల్లో ఏకంగా రూ.470 కోట్ల మేర పసిడి విక్రయాలు జరిగాయి. సుమారు 25 కోట్లతో ఓ ప్రముఖ మీడియా అధిపతితో పాటు, యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న టాప్ హీరో సతీమణి కూడా బంగారం కొన్నవారిలో ఉన్నట్లు అధికారులు లీకులు ఇచ్చేశారు.

తమకు రెగ్యులర్ కస్టమర్లు అయిన ఆ సెలబ్రిటీలు ఫోన్లు చేయటంతో మూతపడాల్సిన షాపును అర్థరాత్రి దాటాక కూడా ఓపెన్ లో ఉంచి తమ బిజినెస్ కానిచ్చేసుకున్నారు సదరు షాపు యాజమానులు. ముఖ్యంగా పంజాగుట్టలోని ఓ ప్రముఖ జ్యువెల్లరీ షాపులో కేవలం రెండే రెండు గంటల్లో 50 కోట్ల బంగారం అమ్ముడుపోయింది. స్టాక్ లేకపోయినా వేరే షాపుల నుంచి తెప్పించి మరీ వారు ఈ వ్యవహారం నడపటం విశేషం.

ఎలా వెలుగు చూసింది...

బ్యాంకుల నుంచి ఆయా షాపు యాజమాన్యాలు చేసిన డిపాజిట్ సొమ్ము మాములగా కన్నా ఎక్కువ మొత్తంలో ఉండేసరికి అనుమానం వచ్చిన బ్యాంకులు ఐటీ శాఖకు సమాచారం అందించాయి. లెక్కలను చేజిక్కిచుకున్న ఆదాయపు పన్నుల శాఖ ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పజెప్పింది. నవంబర్ 8 నుంచి వారం పాటు జరిగిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రంగంలోకి దిగిన నిఘా వ్యవస్థకు ఊహించని షాకులే తగిలాయి.

తప్పుడు బిల్లులతో రెండు లక్షల కంటే తక్కువ బిల్లులు వేసి ముక్కు మొహం తెలియని వారి పేరు మీద(రెండు లక్షలు దాటితే పాన్ వివరాలు ఇవ్వాలి కదా) రిసిప్టులు తయారు చేయించారని వెలుగు చూసింది. సీసీ పుటేజీల ఆధారంగా ఆయా సెలబ్రిటీల బాగోతం వెలుగు చూడటంతో షాపు యాజమాన్యాలు నీళ్లు నమిలాయి. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్లు తెలియటంతో పూర్తి నివేదిక తయారు చేసిన సీబీఐ ఇప్పటికే దానిని ఐటీ శాఖకు అప్పజెప్పిందని సమాచారం.

‘‘కోట్లలో ఉన్న పెద్ద నోట్లతో బంగారం కొన్నవారి వివరాలు తెలుసుకుంటున్నాం. వారికి నోటీసులు ఇవ్వడానికి ముందే మేం వ్యూహాత్మక అడుగులు వేస్తాం. ఆ తర్వాతే వారిని ఎలా దారికి తీసుకురావాలో ఆలోచిస్తాం’ అని ఓ ఐటీ శాఖ అధికారి తెలిపారు. అయితే షాపు యాజమాన్యాలు కూడా ఎవరెంత బంగారం కొన్నారన్న విషయం చెప్పకపోవటంతో ఆ వివరాలేవీ పొందుపరచలేకపోయామని తెలిపిన అధికారులు. వారి పేర్లను బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Gold Purchasing Scam  Star Hero Wife  Media Channel Head  

Other Articles