ఉత్తర్ ప్రదేశ్ లోనూ కమల వికాసమేనా..? BJP expected to win 170-183 seats in UP polls

Bjp expected to win 170 183 seats in up polls

up elections, up polls, uttar pradesh elections, uttar pradesh polls, bjp, congress, sheila dikshit, up bjp, bsp, sp, samajwadi party, mayawati, akhilesh yadav, India Today survey, India today, latest survey

BJP expected to win 170-183 seats in UP polls. While Mayawati's BSP is likely to bag 115-124 seats, the incumbent Samajwadi Party is expected to win 94-103 seats in polls for the 403-member Uttar Pradesh Assembly.

ఉత్తర్ ప్రదేశ్ లోనూ కమల వికాసమేనా..?

Posted: 10/14/2016 11:02 AM IST
Bjp expected to win 170 183 seats in up polls

రానున్న మరికోద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి ఈ ఎన్నికలపైనే వుంది. అటు జాతీయ పార్టీలతో పాటు ఇటు రాష్ట్రీయ పార్టీలు కూడా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్ర పేరుతో దియోదరా టు ఢిల్లీ యాత్రను నిర్వహించారు. అయన సుమారుగా 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి కాట్ పే చర్చ కార్యక్రమాలతో రైతులతో చర్చలు నిర్వహించారు. అయితే అది పార్టీకి మైలేజ్ ను ఇవ్వడం లేదని సర్వే తేల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం మాత్రం రాహుల్ యాత్ర చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తంమైంది.

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకుంటుదని తాజా సర్వేలో తేలింది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంటున్నారు. అయితే, ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం.. హంగ్ అసెంబ్లీ వస్తుందని అన్నారు. ఆ సర్వే ప్రకారం బీఎస్పీ 115-124 సీట్లతో రెండోస్థానంలో నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, 8-12 సీట్లకు మించి గెలుచుకునే పరిస్థితి లేదని అంటున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థులలో మాత్రం మాయావతికే పెద్దపీట వేస్తున్నారు. ఆమె సీఎం కావాలని 31 శాతం మంది చెబితే, అఖిలేష్ మళ్లీ సీఎం కావానేవాళ్లు 27 శాతమే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్, షీలాదీక్షిత్‌లకు కేవలం ఒక్కోశాతం మద్దతు మాత్రమే వచ్చింది. అదే ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటే మాత్రం ఆమెకు 2 శాతం మంది మద్దతు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 18 శాతం మంది, యోగి ఆదిత్యనాథ్‌కు 14 శాతం మంది అండగా ఉన్నారు.

కాగా బీజేపి తీసుకున్న కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం వారికి లాభించేట్లుగా లేదు. ఈ నినాదాన్ని సుమారుగా 54 శాతం మంది ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఈ నిర్ణయాన్ని 29 శాతం ప్రజల నుంచి మాత్రం మద్దతు లభించగా, మరో 17 మంది మాత్రం తటస్థంగా వున్నారు. కాగా రాహుల్ కిసాన్ యాత్రం లాభం చేకూర్చుతుందని 38 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా రామ మందిరం, గో సరంక్షణ కనిపిస్తున్నాయి. 2012 ఎన్నికల తర్వాత యూపీలో దళితులపై దాడులు పెరిగాయని 54 శాతం మంది ముక్తకంఠంతో చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : up assembly polls  BJP  Congress  Mayawati  Rahul Gandhi  India today  latest survey  

Other Articles