కోడలి రిపోర్టుతో బాబు మైండ్ బ్లాక్..! Nara Brahamni's shocks Chandrababu, TDP

Nara brahamni s shocks chandrababu tdp

nara brahmani, chandrababu naidu, nara lokesh, third party survey, telugu desam party, survey results, brahmani report, shock to tdp, shock to chandrababu naidu, andhra pradesh

If soures are to be belived, a new news is frustating TDP party mlas and even party chief chandrababu. according to sources Nara likesh Wife Nara Brahmani has conducted a third party survey.

బ్రాహ్మణి రిపోర్టుతో చంద్రబాబు మైండ్ బ్లాక్..!?

Posted: 10/13/2016 09:40 PM IST
Nara brahamni s shocks chandrababu tdp

తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మిత్రపక్షాలు ఏదైనా కొంచెం వ్యతిరేక వాణి వినిపిస్తే చాలు.. అప్పటికప్పుడు వారిపై విమర్శలను గుప్పిస్తూ.. ముప్పేటదాడికి పాల్పడి.. అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంతో నిష్ణాతులైన వారిగా పేరొందిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడేం చేస్తున్నారు. ఎవరినీ విమర్శిస్తారు, విమర్శలు గుప్పించే ధైర్యం వుందా..? సాధారణంగా అధికార పక్షంలో వున్నవారిని విపక్షాలు విమర్శంచడం సహజం. కానీ, విపక్షాలపైనే ముప్పేట విమర్శల దాడికి పాల్పడే అధికార పక్షమని విమర్శలను ఎదుర్కోంటున్న టీడీపీకి తాజాగా చక్కర్లు కోడుతున్న పుకార్లు మింగుడు పడని విషయమే.

ప్రత్యేక హోదా కావాలంటే బీజేపి-టీడీపీకే ఓటు వేయాలని, అర్థికంగా కృంగిన రాష్ట్రాన్ని అదుకోవడం మాకే సాథ్యమని పదేపదే చెప్పడంతో పాటు హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తానేనని చంద్రబాబు పదేపదే చెప్పడం అదే తరహాలో అమరావతి కూడా అభివృద్ది చేస్తానని హామీలు గుప్పించడం వల్లనో, లెక పరిపాలనాధక్ష్యతలో చంద్రబాబుకు సాటి వేరెవరూ లేరన్న ప్రచార మహత్యమో గానీ రాష్ట్ర ప్రజలు ఈ మిత్రపక్షానికి అధికారాన్ని అందించారు. ఇందులో కీలక భూమిక ఫోషించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రభావం కూడా లేకపోలేదు. తాను ఎన్నికలలో పోటీ చేయనని, అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ-బీజేపిలకే ఓటు వేయాలని ఆయన ప్రచారం కూడా వీరికి అధికారాన్ని అందించింది.

అయితే ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన టీడీపీ, ఇస్తామని నమ్మించి నయవంచన చేసిన బీజేపిలపై కూడా ఆయన విమర్శలు చేశారు. టీడీపీ ఎంపీలు వారి వ్యాపారాలను చూసుకోవడంతోనే బిజీగా వుండటం వల్లే హోదా రాలేదని ఇప్పటికే చురకలంటించారు. ఇక తిరుపతి సభ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి కూడా తెలుగోడి సత్తా ఏమిటో.. చూపుతామన్నారు. మరో క్లారిటీ కూడా ఆ సందర్భంగా ఇచ్చారు, తాను రానున్న ఎన్నికలలో బిజేపితో కలసి పోటీ చేస్తానన్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు.

అయితే ఫవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజాలు అంగీకరించే స్థాయిలో లేని టీడీపీ నేతలు ప్రజలు ఏం అనుకుంటున్నారో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడానికి ఇష్టపడని అధికారపక్ష నేతలకు వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు, అలాంటి షాకే ఇప్పుడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రహ్మిణీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ పరిస్థితి ఏమిటనే విషయంపై థర్డ్ పార్టీతో సర్వే చేయించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ సర్వే ఫలితాలను ఆమె చంద్రబాబు ముందు పెట్టినట్లు కూడా చెబుతున్నారు. ఆ ఫలితాలు చూసి చంద్రబాబు ఖంగుతిన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా బ్రాహ్మణి ఈ సర్వే చేయించారట. రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 57 సీట్లకు మించి రావని సర్వేలో తేలినట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం, బిజెపిలు కలిసి 57 సీట్లు సాధిస్తే మిగతా సీట్లు ప్రతిపక్షాలకు వెళ్తాయని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.

అయితే, మిగతా సీట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్తాయా, ఒకవేళ పవన్ కల్యాణ్ బరిలోకి దిగితే జనసేన పార్టీకి వెళ్తాయా అనేది మాత్రం తేల్చలేదట. ఇచ్చిన హామీలు సరిగా అమలు కాకపోవడం, రాజధాని అంశం అయోమయంగా మారడం, అవినీతి పెరగడం వంటి కారణాలు తెలుగుదేశం పార్టీపై ప్రతికూల ప్రభావం వేస్తున్నాయని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. అయితే, బ్రాహ్మణి సర్వే చేయించినట్లు జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఈ వార్తలే నిజమైతే మాత్రం టీడీపీ నేతల పరిస్థితి కుడిదిలో పడిన ఎలుక పరిస్థితిలామారింది. పార్టీ అధినేత కోడలుపై విమర్శలు గుప్పించనూ లేదు. ఇటు తిప్పికోడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles