రాజకీయాల్లోకి రానున్న నయనతార | nayanatara political entry and join in AIADMK

Nayanatara political entry and join in aiadmk

Nayanatara political entry, Nayan politics, Nayanatara political entry, nayanatara jayalalitha, Nayanatara AIADMK, Nayanatara tamilnadu politics, Nayanatara DMK, nayanatara party

Actress Nayanatara political entry and join in AIADMK.

నయనతార రాజకీయాల్లోకి వస్తోందా?

Posted: 08/31/2016 09:17 AM IST
Nayanatara political entry and join in aiadmk

అందం, అభినయంతో ఆకట్టుకుంటూ టాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న నయనతార రాజకీయ రంగం ప్రవేశం చేయనుందా?.. అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. రాజకీయ అరంగేట్రానికి సంబంధించి నయన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె అధికార పార్టీలో చేరనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సాధారణంగా తాను నటించే చిత్రాల ప్రమోషన్‌కు నయనతార హాజరుకారు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు ముందే చెప్పేస్తారు. ఈ విషయంలో ఆమెపై చాలా విమర్శలు ఉన్నాయి. నటించడం వరకే తనపని అని, మిగతాది దర్శకనిర్మాతలు చూసుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెబుతారు. అలాంటి నయన్ మనస్తత్వంలో మార్పు కనిపిస్తోంది.

ఇటీవల అధికార పార్టీ నిర్వహించిన స్పోర్ట్స్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చర్చకు తెరలేపారు. హీరోయినలా కాకుండా సాధారణ మహిళలా నయన్ ఆ కార్యక్రమానికి హాజరుకావడంతో విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఇదే ఆమె రాజకీయరంగ ప్రవేశంపై చర్చలకు తెరలేపింది. ఆమె అధికార పార్టీలో చేరడం ఖాయమని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయంలో నయన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

కోలీవుడ్ రాజకీయాల్లో సినీ తారల సందడి మరింత ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి చేరుతున్న ఈ మలయాళీ చిన్నది రాజకీయాల్లో ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. ఇటీవల తమిళనాట జరిగిన ఎన్నికల సందర్భంగా నటి నమిత అన్నాడీఎంకేలో చేరిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే నయనతారకు ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని డీఎంకే తెగ ట్రై చేసింది. కానీ, ఆ సమయంలో సినిమాలతో ఆమె నో చెప్పేసింది. అయితే ఈ విషయంపై నయనతార స్పందించకపోవటంతో ప్రస్తుతం ఆమెకు అలాంటి ఆలోచనలేవీ లేకపోవచ్చేనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Nayanatara  political entry  AIADMK  

Other Articles