bala krishna warns central government on special status issue

Critics on nandamuri balakrisha comments on special status

andhra pradesh, special status, balakrishna, chandrababu, TDP, BJP, NDA, PM Modi, narendra modi, YSRCP. Congress, Sonia gandhi, Rahul Gandhi, YS jagan, NTR, Telugu desam party

critis araise on hindupur mla and tollywood actor balakrishna as he warned central government in regard of andhra pradesh special status issue.

మీడియా ముందేనా..? లేక నిజంగానా..?

Posted: 08/05/2016 11:21 AM IST
Critics on nandamuri balakrisha comments on special status

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి ఎన్టీరామారావు తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వియ్యంకుడు సినీనటుడు బాలకృష్ణ రాజకీయాలతో ఇన్నాళ్లు పరోక్షంగా సంబంధం పెట్టుకుని.. ఈ సారి ఏకంగా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి దిగిన ఆయన కూడా రాజకీయాలను బాగానే వంటబట్టించుకన్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేల తరహాలోనే బాలయ్య కూడా మీడియా ముందు ఒకలా.. మీడియా వెనుక మరోలా తన సహజత్త్వాన్ని ప్రదర్శిస్తుంటారన్న విమర్శలు వినబడుతున్నాయి.
 
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయం విషయంలో రక్తం మరిగిపోతుందని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అ వెనువెంటనే అరటాకు సామెతను చెప్పడంతో హోదా విషయంలో ఆయన నిజాయితీ పూర్తిగా అర్థమైందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేసి.. మరీ అధికార టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం నీటి అయోగ్ కు అప్పగించిందని.. ఈ విషయంలో ఎవరూ తొందరపడవద్దని చెప్పిన చంద్రబాబు.. నీటి అయోగ్ నివేదికపై ముందే సమాచారం అందుకుని హోదా సంజీవని కాదని కూడా చెప్పారు.

అసలు చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో గత రెండేళ్ల కాలంలో ఎన్ని పర్యాయాలు.. ఎన్ని మాటాలు మాట్లారో తెలుసా..? ఒకసారి కావాలంటారు..? మరోసారి సంజవని కాదంటారు..? ఒక సారి నీటి అయోగ్ అంటారు..? ఇంకోసారి రక్తం మరుగుతుందని అంటారు.? ఇలా ఎన్ని పర్యాయాలు ఎన్ని కల్లబోల్లి మాటలు చెప్పి కాలం వెల్లబుచ్చుతారని ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రశ్నలను సంధిస్తున్నాయి. దీంతో ఇక తాను తెరపైకి రాకుండా తన పార్టీ శ్రేణుల చేత ప్రకటనలు గుప్పించే చర్యలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ నేతలు అనేక ప్రకటనలు గుప్పించారు.

అయితే తాజాగా ప్రత్యేక హోదా విషయంలో బాలకృష్ణ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. ఏపీని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి.. లేకుంటే పర్యవసానాలను అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రాన్ని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఎవర్నీ బతిమాలాల్సిన అవసరం లేదన్నారు. ‘‘మనం అప్పుడప్పుడూ అంటూ ఉంటాం.. దేనికో ఈ దిక్కుమాలిన జోహార్లు.. దేనికో సిగ్గులేని బెదిరింపులు.. ఎందుకో రాష్ట్ర లబ్ధికై ఇంత రగడ అని అక్షేపించారు.

యాచన అన్నదే ఎరుగని ఆంధ్రరాష్ట్రం ఎంత దిగజారిపోయింది. ఎంత వింత సిగ్గుచేటు.. ఇదిగో.. మన భుక్తి మన చేతియందేగలదు. ముష్టి ఎత్తుకొనుట యందుకాదు’’ అంటూ తన వాక్చాతుర్యంతో బీజేపీపై మండిపడ్డారు. అయితే బాలయ్య కూడా మీడియా ముందు ఎగిసిపడ్డారు కానీ.. నిజానికి హోదా విషయంలో ఆయనకు చిత్తశుద్ది వుంటే.. రెండేళ్లు గడుస్తున్నా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, పైగా హోదా సంజీవని కాదని చెప్పిన చంద్రబాబును ఎందుకు నిలదీయరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఆయన ముందు నిలిచి ఉద్యమాన్ని ఎందుకు రచించలేదని ప్రజలు నిలదీస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలు కూడా మీడియా ముందు మాత్రమే కానీ కేంద్రం వద్ద కాదని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  special status  balakrishna  chandrababu  TDP  BJP  NDA  PM Modi  narendra modi  YSRCP. Congress  

Other Articles