Smriti Irani dropped from Cabinet Committee on Parliamentary Affairs

Smriti irani out of ccpa prakash javadekar gets in

smriti irani, irani, smriti irani cabinet, irani cabinet panel, ncp,national congress party, smriti parliament cabinet panel,ccpa, smriti parliament panel, textile minister, india news

Ahead of the Monsoon Session of Parliament, beginning from Monday, the Cabinet committee on parliamentary affairs (CCPA) has been rejigged, with Union minister Smriti Irani getting dropped.

స్మృతికి దెబ్బ మీద దెబ్బ.. ఎందుకబ్బా..?

Posted: 07/17/2016 01:33 PM IST
Smriti irani out of ccpa prakash javadekar gets in

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన ఎంపీలను తన వాక్చాతుర్యంతో మెప్పించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రాధాన్యత తగ్గించాలని బీజేపి పార్టీ భావిస్తుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. అయితే అమె ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ కేంద్రమంత్రుల కన్నా స్పీడుగా దూసుకెళ్లడం, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అమె తనపై వచ్చే విమర్శలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతూ అనునిత్యం వార్తల్లో నానడం అందుకు కారణమా..? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖను నిర్వహించిన స్మృతికి.. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శాఖను మార్చి అమె వేగానికి కళ్లెం వేసింది. అంతగా ప్రాధాన్యం లేని జౌళి శాఖను ఆమెకు అప్పగించి.. ప్రకాశ్ జవదేకర్కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించి మానవ వనరుల అభివృద్ధి శాఖను కేటాయించిన బీజేపి అధిష్టానం.. తాజాగా మళ్లీ అమెకు షాక్ ఇచ్చింది. స్మృతి ఇరానీని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రమంత్రిగా అందులోనూ మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగిన సమయంలో దేశంలోని విశ్వవిద్యాలయాల్లోని సమస్యలను పరిష్కరంలో అమె నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? అందుకే అమెకు శాఖ బదిలతో వేటు వేశారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో సరస్వతి నిలయాలుగా బాసిల్లుతున్న విశ్వవిద్యాలయాల్లో కలహాలు, వివాదాలు రేగుతూన్న అమె వాటిని అంతగా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. హెచ్సీయూ విద్యార్థి  రోహిత్ వేముల ఆత్మహత్య, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ అరెస్ట్ తదితర సంఘటనలతో దేశంలోని యువత పార్టీకి దూరమవుతున్నారన్న కారణం కూడా అమె శాఖ బదిలీ వేటుకు కారణమైందని సందేహాలు కలుగుతున్నాయి

కేంద్రమంత్రిగా కోనసాగుతూ కూడా అమె మానవ వనరుల శాఖలో మార్పులు తీసుకురావడం. శాఖపై తనదైన మార్క్ వేసుకోవడంతో అంతగా నెగ్గుకు రాలేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఇక అంతకన్నా అధికంగా అమె కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు కూడా వినిపించాయి. అనునిత్యం రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం, ఈ విషయమై అమె సోషల్ మీడియాలో తన భావాలను ప్రకటించడం కూడా అమెకు శాఖ బదిలీ సహా పార్టీలో ప్రాధాన్యం తగ్గడానికి కారణమయ్యిందని సమాచారం. అయితే వీటితో పాటు గత పార్లమెంటు సమావేశాలలో తనదైన వాగ్ధాటితో అటు ప్రధాని సహా పార్టీ నేతల నుంచి ప్రశంసలు అందుకున్న అమె.. ప్రధాని మోడీ, సీనియర్ కేంద్రమంత్రుల కన్నా ముందుకు దూసుకుపోవడం కూడా కారణమై వుండవచ్చన అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  irani  smriti irani cabinet  irani cabinet panel  BJP  

Other Articles