IAS officer Khemka under fire for 'causing Rs 4-cr loss' to Haryana seeds board

Ashok khemka chargesheeted on 3 year old case of unsold stock

ashok khemka, manohar lal khattar, raxil, raxil scam, raxil fungacide purchase scandal, haryana whistleblower transferred, haryana whistleblower, haryana government, whistleblower pradip kasni, haryana news, nation news

Almost eight months after the Haryana government dropped the chargesheet against whistleblower IAS officer Ashok Khemka in the Robert Vadra land deal, Haryana's BJP government has issued a fresh chargesheet against him.

నిజాయితీకి మారుపేరైన ఖేమ్కాపై అవినీతి మకిలి..

Posted: 07/14/2016 01:44 PM IST
Ashok khemka chargesheeted on 3 year old case of unsold stock

అవినీతి ఎక్కడున్నా దానిని నిర్మూలిస్తాం.. అవినీతి రహిత పాలనే మా ధ్యేయం, ఏ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చినా.. అక్కడ ఏ రూపంలోనూ అవినీతి లేకుండా చేస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు, ఇటు రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల ముందు హామీలు గుప్పించిన బీజేపికి అసలు అ విషయమే గుర్తులేనట్లుగా వుంది. నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా బీజేపి హామీలు ప్రగల్భాలేనన్న అరోపణలు కూడా మిన్నంటుతున్నాయి. ఇప్పటికే దేశ అర్ధిక పురోగాభివృద్దిలో ప్రధాని మాటలకు, వాస్తవ పరిస్థితులకు చాలా వత్యాసముందని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు కూడా బీజేపికి మాటల కోటలే తప్పల వాస్తవాలు తోటలు కావని ప్రచారాన్ని నమ్మిన పక్షంలో బీజేపి రానున్న కాలంలో ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లడు రాబర్ట్ వాద్రాకు చెందిన భూ కేటాయింపులు వ్యవహారాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసి.. 2013లో నుంచి దేశ ప్రజలందరి చేత నిజాయితి గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు హర్యానా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హోదాను కల్పించకపోగా.. పైపెచ్చు అయనపై అవినీతి బురద జల్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అవినీతిపరుల పాలిట సింహస్వప్నంగా మారిన అయనను యూపీఏ హయాంలో వెనకేసుకోచ్చి అండగా నిలచిన బిజేపి ఇప్పుడు అయనను ఇబ్బందుల పాలు చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే 22 ఏళ్ల సర్వీసులో 46 సార్లు బదిలీ అయిన అశోక్ ఖేమ్కాకు తగిన ఉన్నత పదవిని అప్పగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు గతంలో ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రిత్వ కార్యాలయం నుంచి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. ఆ తర్వాత ఏందుకో పిలుపుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు, ఏకంగా జాతీయస్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్దమైన ఖేమ్కా.. ఇక దానిపై చడీచప్పుడూ కూడా లేకపోవడంతో తన అలవాటుగా వేచిచూడటం ప్రారంభించాడు, ఈ తరుణంలో ఆయనను మళ్లీ తన సొంత కేడర్ అయిన హర్యానాకే పరిమితం కావాల్సి వచ్చింది.

అయితే మూడు నెలల క్రితం ఆయనకు ముఖ్య కార్యదర్శి హోదా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిన హర్యానా  ప్రభుత్వం, ఆయనకు పదోన్నతి కూడా కల్పించింది, సరిగ్గా జనవరి 1న ఉత్తర్వులైతే జారీ అయ్యాయి, కానీ అప్‌గ్రేడేడ్ పోస్టు మాత్రం ఆయనకు కేటాయించలేదు. దీనిపై అప్పట్లో ఖేమ్కా తన ట్విట్టర్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ దక్కినా, మూడు నెలలుగా తక్కువ హోదా కలిగిన పోస్టులోనే కొనసాగిస్తున్న ప్రభుత్వం తనను అవమానపరుస్తోందని, తన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి అధికారి బ్రిగేడియర్ స్థాయి పదవిలో ఉన్నట్టుగా ఉందని మనస్సులోని బాధను వెల్లడించారు.

అయితే ఖేమ్కా నిజాయితీకి అండగా నిలచిన బీజేపి నేతలు, ప్రభుత్వాలు ఇప్పుడు ఆయన నిజాయితీకి జంకుతున్నారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి, కేంద్రస్థాయిలోకి తీసుకుంటామన్న ప్రధాని మాటతప్పారు..? ముఖ్యకార్యదర్శి పదవిని కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. వీటి మాట పక్కన బెడితే.. ఎప్పుడో మూడేళ్ల క్రితం కిందటి కేసును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వినా.. చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే దానినే అసరాగా చేసుకున్న బీజేపి ప్రభుత్వం మాత్రం ఖేమ్కాపై అవినీతి అరోపణల కింద చర్యలు తీసుకుంది.

ఖజానాకు నష్టం చేకూర్చారన్న అభియోగంతో ఖేమ్కాపై బీజేపీ ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేసింది. 2012-13 మధ్య రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఎండీగా ఉన్న ఖేమ్కా.. గోధుమ గింజలను పూర్తిగా అమ్మకపోవడంతో రూ. 3.41 కోట్ల నష్టం వచ్చిందంటూ ఈ నెల 1న చార్జిషీట్ నమోదు చేసిన ప్రభుత్వం 8న ఆయనకు పంపింది. ఖేమ్కా నిర్లక్ష్యంతో 87 వేల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు వృధాగా పోయాయని ఆరోపణలు వచ్చాయి. అయితే బీజేపి ప్రభుత్వ చర్యలపై విమర్శలు కోనసాగుతున్నాయి. ఖేమ్కా ఎన్ని నెలల పాటు ఆ పదవిలో వున్నారని..? అయనను విత్తనాల అమ్మకాలకు బాధ్యులను చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తనకు కేటియించిన పనులను సక్రమంగా పూర్తి చేయని పక్షంలో అతని సామర్థ్యం పై ప్రభావం చూపుతుంది, కానీ అయనపై అవినీతి బురద జల్లి అయనకు తాఖీదులు అందిచేలా చర్యలు తీసుకోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి, ఇక హర్యానాకు ముఖ్యకార్యదర్శిగా కావాల్సిన వ్యక్తి ఏడు మాసాలు కావస్తున్నా అ ఊసే తీయకుండా.. అటుగా ఏలాంటి చర్యలు చేపట్టకుండా అధికారులపైనే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. బీజేపి హామీ ఇచ్చిన అచ్చేదిన్ ఫలితాలను ప్రజలకు అందించే అధికారులకే రావడం లేదని, ఇక ప్రజలకెప్పుడు వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నలు సంధిస్తున్నారు.

హర్యానాకు చెందిన బీజేపి అరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ మాత్రం ఖేమ్కాపై అవినీతి బురద జల్లే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయన నిజాయితీని శంఖించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. అయనను వెనకేసువచ్చే ప్రయత్నం చేశారు. కాగా దీనిపై ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా స్పందిస్తూ.. మంత్రి నిజంగా ఖేమ్కా నిజాయితీని సమర్థిస్తే.. బీజేపి ప్రభుత్వం నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలకు నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపి ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని, అప్పుడు నిజాయితీ అధికారులకు బదిలీల వేటు పడితే.. ఇప్పుడు వారిపై అవినీతి బురద జల్లే ప్రయత్నాలు సాగుతున్నాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok khemka  Sr. IAS officer  chargesheet  Haryana government  

Other Articles