ktr gives counter to chandra bau in a smooth manner

Ktr tweets to babu on high court saying sir

Telangana minister KT Rama rao, AP CM Chandrababu, Amaravati, state governings begin from amaravati, twitter, High court, biferfication of high court, ktr tweet, chandrababu naidu, high court, amaravathi, justice, mile stone

Telangana minister KTR tweets AP CM chandrababu, "Sir,Congratulations on the milestone. To expedite justice delivery,isn't it imp that AP has High Court in Amaravati?"

బాబుకు తెలంగాణ ‘చినబాబు’ సన్నాయి నోక్కుల ట్విట్..

Posted: 07/02/2016 12:15 PM IST
Ktr tweets to babu on high court saying sir

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నాయి నోక్కుల ట్విట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష హోదాలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నంత కాలం టీడీపీ అంధ్రా పార్టీ అని విమర్శించిన కేటీఆర్.. ఒక్కసారిగా తన గానాన్ని మార్చారెందుకు అన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో వచ్చిన కొత్తలోనూ టీడీపీపై దూషణపర్యానికి పదును పెట్టి.. అటు సామాజిక మాధ్యమంలోనూ ఘాటైన విమర్శలు గుప్పించన నేత.. తన పల్లవిని ఎందుకు మార్చారో అర్థం కావడం లేదు.

తెలంగాణ ఉద్యమంలోనూ టీడీపీకి పలు సందర్భాల్లో అక్కున చేర్చుకుంది టీఆర్ఎస్. ఆ తరువాత మళ్లీ దూరం చేసుకుంది. పార్టీ ఉద్భవించిన తొలి ఆరేళ్లు టీడీపీ, చంద్రబాబును తెలంగాణ ద్రోహీ అంటూ శివాలెత్తి విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ పార్టీ.. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమి పేరుతో కలసి ఎన్నికలలో పోటీ చేసి భంగపడ్డారు. అంతే మళ్లీ తమ పాతరాగాన్నే ఎతుకుని విమర్శలను ఎక్కుపెట్టారు. అసలెందుకు వీరి మధ్య దోబూచులాట సాగుతుందోనన్నది అర్థంకాక తెలంగాణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ట్విట్టర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందిస్తూనే.. తెలంగాన మంత్రి కేటీఆర్ చిన్నపాటి పోలిటికల్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా తమ ప్రభుత్వం ఈరోజు నుంచి పరిపాలన ప్రారంభించడంతో సంతోషంగా ఉందని, ఇది ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయం అని రెండురోజుల కిందట చంద్రబాబు చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ రీట్వీట్ చేస్తూ.. గౌరవ ప్రదంగా అభినందనలు తెలుపుతూనే సన్నాయి నోక్కులు నోక్కారు. ‘‘సార్‌. సత్వర న్యాయం అందించేందుకు ఏపీ హైకోర్టు అమరావతిలో ఉండాల్సిన అవసరం లేదా’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు విభజన కోసం తెలంగాణలో న్యాయవాదులు, న్యాయాధికారులు ఉద్యమిస్తున్న క్రమంలో టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ న్యాయవాదులు అందరూ టీడీపీ పార్టీయే దీనిని అడ్డుకుంటుందని బాహాటంగానే విమర్శించారు. వారే కాదు స్వయంగా కేటీఆర్ సోదరి ఎంపి కవిత కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే కేటీఆర్ మాత్రం అభినందనలు చెబుతూనే సన్నాయి నోక్కులు ఎందుకు నోక్కుతున్నారన్న అర్థం కాని ప్రశ్న. తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి తెలంగాణ హైకోర్టు కోసం ఉద్యమిస్తున్న క్రమంలో కేటీఆర్ సన్నాయి నోక్కులు చర్చనీయాంశంగా మారాయి.

ఇన్నాళ్లు ప్రజాక్షేత్రంలో ఘాటైన విమర్శలు గుప్పించిన కేటీఆర్.. ఒక్కసారిగా తన పంథాను మార్చి ఏకంగా సన్నాయి నోక్కులకు దిగడంలో అంతర్యమేమిటో అర్థకాక తెలంగాణ వాసులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఖమ్మం జిల్లా పర్యటనలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి పోరుగు రాష్ట్రంలో తగవులెందుకు అని చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అంతేకాదు టీఆర్ఎస్ నేతలు తమకు అవసరం అయినప్పుడు మాత్రం టీడీపీని కార్నర్ చేస్తూన్నారు.. లేని సందర్భాలలో ఇలా సన్నాయి నోక్కులు నొక్కుతున్నారన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr tweet  chandrababu naidu  high court  amaravathi  justice  mile stone  

Other Articles