పవన్ పాంచజన్యం పూరిస్తాడా? | Pawan Kalyan fully focused on Janasena now

Pawan kalyan fully focused on janasena now

Pawan Kalyan, janasena, Pawan Kalyan chiru mistake, pawan never make mistake like chiru, చిరు తప్పును పవన్ చేయడు, చిరు కంటే పవన్ బెటర్, రాజకీయాలపై పవన్, పవన్ జనసేన, ఒంటరిపోరుకు జనసేన, తెలంగాణ న్యూస్, రాజకీయాలు, ఏపీ రాజకీయాలు, తాజా వార్తలు, పొలిటికల్ గాసిప్స్, latest news, political gossips, janasena news

Pawan Kalyan fully focused on Janasena now. secret meetings with party members.

పవన్ పాంచజన్యం పూరిస్తాడా?

Posted: 06/17/2016 04:30 PM IST
Pawan kalyan fully focused on janasena now

రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణించినవారు తక్కువేం కాదు. అలాగనీ అట్టర్ ఫ్లాపు అయిన వారు ఉన్నారు. జనాల్లో మంచి క్రేజ్ ఉండగానే రాజకీయాల్లోకి వచ్చి దాన్ని పోగొట్టుకుని బాధపడేవాళ్లు ఉన్నారు. అయితే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే పూర్తిస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమైపోతున్నాడు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓవైపు సినిమాల సంగతి చూసుకుంటూనే పార్టీ కోసం రహస్య మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి జనసేన ప్రకటించిన సమయంలో పవన్ మీద జనాలకు పెద్దగా ఆశలు లేవు. అంతకన్నా ఎక్కువ హడావుడి చేసిన ప్రజారాజ్యం రోజులను గుర్తుచేసుకుని జనాలు చిన్నగా నవ్వుకున్నారు కూడా. అయితే తాను ప్రజల తరపునే ఉన్నానని నమ్మించడానికి పవన్ కి చాలా సమయమే పట్టింది. విభజన సమయంలో సైలెంట్ గా ఉన్నప్పటికీ రాజధాని భూసేకరణలో మాత్రం ప్రజలకు అండగా ఉంటానని భరోసా కల్పించాడు. ఆ సమయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కూడా కారణం పవన్ తూళ్లూరు పర్యటనే.

అడపా దడపా ప్రెస్ మీట్లు పెట్టడం తప్పించి ఏం చేయట్లేదనే విమర్శలు ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల ద్వారా వాటన్నింటికి చెక్ పెట్టాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన అవసరం ప్రజలకు ఉందన్న నమ్మకంతోనే బరిలో దిగేందుకు సిద్ధమైపోతున్నాడు. అయితే 2009 ఎన్నికల సమయంలో పీఆర్పీ ద్వారా చంద్రబాబు సీఎం ఆశలకు గండికోట్టడంతోపాటు ఓట్లను చీల్చి 18 సీట్లను గెల్చుకున్నాడు చిరంజీవి. ఇప్పుడు ఆ పని పవన్ చేయాలని చూస్తున్నాడా? అన్న ప్రశ్నలు లేచాయి. కానీ, చిరంజీవికి, పవన్ కి మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు, ఇదే సమయంలో జనసేన అధినేతకి పలు సూచనలు చేస్తున్నారు.

నిజానికి అధికార పక్షం లేదా బీజేపీ పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని తొలుత అనుకున్నప్పటికీ, ఆపై పవన్ మనసు మార్చుకున్నాడంట. అయితే పొత్తు ద్వారా జనాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవడమే తప్పించి, .ఏం లాభం ఉండదని ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ కలిసి వెళ్లాలనుకుంటే మాత్రం ప్రజలకు ముందుగానే తెలియజేయాలని వారంటున్నారు. చిరు ఆరంగ్రేటం చేసిన సమయంలో రాజకీయాల పరంగా జనాలకు ఆయనపై పెద్దగా సానూభూతి చూపలేకపోయారు. కానీ, పవన్ విషయంలో మాత్రం అలా కాదు. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ పవన్ పట్ల ప్రజలకు మంచి అభిప్రాయమే ఉంది.

పైగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ పవన్ కి అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి సిద్ధమైతే మాత్రం అధికారం మాట పక్కనబెట్టి ఊహించని రీతిలో ప్రతిపక్ష వైఎస్సార్పీకి గండిపడటం మాత్రం ఖాయం. వెరసి చిరు వేసిన తప్పటడుగు పవన్ వేయడనే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   
   
భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  janasena  chiru political mistake  

Other Articles