HRD takes no action on Appa Rao, is this the justice to rohit vemula family

Apparao takes charge as hcu vc what is use of hrd fact finiding commitee

high alert, hyderabad central university, kanhaiah kumar, rohith vemula, smruthi irani, rahul gandhi, HRD, cpi, cpi(m), ambedkar students association, vc appa rao, JNU row, cpi narayana, Umar Khalid, Anirban Bhattacharya, Ap government, telangana police, lathi charge hcu, sitaram yechury, modi, PM narendra modi, suravaram sudhakar reddy, JNU,

HRD fact finding commitee strain on Ambedkar student organisation leader Rohit Vemula suicide goes in vain, as centre and HRD department takes no charges on VC Apparao

వీసీ అప్పారావు మోనార్క్.. హెచ్ ఆర్ డి చర్యలు లేనట్లే..!?

Posted: 04/02/2016 11:51 AM IST
Apparao takes charge as hcu vc what is use of hrd fact finiding commitee

విద్యార్థుల జీవితాలతో అటలాడుకోవడం అలావాటుగా మారిందని అభియోగాలను ఎదుర్కోంటున ప్రోఫెసర్ అప్పారావుకు మరోమారు వైస్ ఛాన్సిలర్ గా బాధ్యతలు  అప్పగించడం చూస్తుంటే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ లో దళిత వర్గానికి చెందిన యువమేధావి రోహిత్ వేముల సహా ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్, ఆ తరువాత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు.. విసీగా అప్పారావు రాక.. చివరకు రోహిత్ ఆత్మహత్య.. ఇలా అనేక ఘటనలకు కారణం ద వన్ అండ్ ఓన్లీ అప్పారావు. ఈ మాట అనింది.. ప్రశ్నలు ఉదయించేలా చే్స్తుంది మాత్రం నిజనిర్థారణ కమిటీయే.

హెచ్ సీ యూలో  అంబేద్కర్ విద్యార్థి సంఘాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న లక్ష్యంతోనే మరోమారు సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సిలర్ బాధ్యతలను తీసుకుని అస్పారావు అడుగుపెట్టారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. వీసి అప్పారావుపై అణగారిన వర్గాల వ్యతిరేకని అని విద్యార్థి సంఘాలు అరోపిస్తున్నాయి. 2003లో కూడా అంబేద్కర్ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులను రస్టికేషన్ చేసిన ప్రశాంత యూనివర్సిటీలో వర్గాలు, వైశమ్యాలకు కారణం అప్పారావేనన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

అయితే కాకతాళీయంగా అప్పుడు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరాజయం పాలై.. యూపీఏ ప్రభుత్వం కొలువుదీరగానే.. కొంతకాలానికి అప్పారవు బదిలీ అయ్యారు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పారావు మళ్లీ వీసీగా వచ్చిరాగానే అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకుడు రోహిత్ వేములతో పాటు మరో ఐదుగురు విద్యార్థులపై వేటు వేయడం.. దీంతో ఆందోళన కొనసాగిస్తూ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ యావత్ ఘటనలో కేంద్రం ప్రభుత్వంపై, కేంద్ర మంత్రుల ప్రమేయంపై హెచ్ ఆర్ డీ శాఖ ఓ సత్యశోధన కమిటీని వేసింది.

రోహిత్ వేముల అంశం చిన్నగా రాజుకున్నా.. విశ్వవిద్యాలయం యువత అందరూ సమీకరించి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలతో తీవ్రరూపం దాల్చింది. వాటికి రాజకీయ పార్టీలు తోడవ్వడంతో పెను దుమారంగా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్య కాదని, కేంద్ర ప్రభుత్వం హత్య అని కూడా పలు పార్టీలు ఆరోపించాయి. అంశం పరిధి దాటి వెళ్తున్న సమయంలో రోహిత్ వేముల ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిజనిర్థారణ కమిటీని వేసింది. అయితే సత్య శోధన అనంతరం కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది.  

కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల లేఖలు వేముల ఆత్మహత్యకు కారణం కాదని, ఆ లేఖలను అసలు వర్సిటీ యాజమాన్యం పరిగణలోకే తీసుకోలేదని చెప్పింది. కానీ కేంద్ర మంత్రులు లేఖలు రాశారని మాత్రం అంగీకరించింది. అయితే విశ్వవిద్యాలయంలోని ఘటనలకు, పరిస్థితి అదుపు తప్పడానికి, రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణం మాత్రం అప్పారావేనని నిజనిర్థారణ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తీసుకుని తన బాధ్యతలను పక్కన బెట్టిన అప్పారావు.. రెండు నెలల తరువాత వీసీగా బాధ్యతలు తీసుకున్నారు.

అదీ జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్.. హెచ్ సి యుకు విచ్చేస్తున్నారని సమాచారం అందుకున్న కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడంతో హుటాహుటాని తరలివచ్చిన వీసి తన బాధ్యతలను పునికి పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగ్యాయి. అయితే ఇక్కడ కేంద్ర మానవ వనరుల శాఖ నియమించిన నిజనిర్థారణ కమిటీ ఎందుకు..? తమ దారిలో తాము ప్రయాణం చేస్తామని హెచ్ ఆర్ డీ శాఖ కమిటీని వేసింది కాలయాపనకే అన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

యూనివర్సిటీలో తలెత్తిన అన్ని ఘటనలకు వీ సీ అప్పారావు కారణమని కమిటీ చెప్పినా.. అతనిపై చర్యలు తీసుకోలేదు. అసలు తీసుకుంటుందన్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీంతో కేంద్ర మానవ వనురుల శాఖ యువ మేధావి వర్గానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటుందో.. అర్ధం కావడం లేదు. విదేశాల్లో ప్రధాని పర్యటిస్తూ పలు సందర్భాలలో రాబోయే కాలం భారత్ ది మాత్రమేనని, భారత్ లో మాత్రమే యువ మేధావుల సంఖ్య అధికంగా వుందని ప్రసంగిస్తుంటారు. కానీ వాస్తవానికి యువ మేధావులు తయారువతున్న విశ్వవిద్యాలయాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా వుంటున్నాయి. యువమేధావుల ఆత్మహత్యలపై వేసిన కమిటీలు సత్యశోధన చేసి సమర్పించిన నివేదికలకు కూడా హెచ్ ఆర్ డి బుట్టదాఖలు చేస్తుంటే.. యువ మేధావులు ఎలా స్వతంత్రగా గొంతెత్త గలరో కేంద్రానికే అర్థం కావాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles