Tdp to take alternative steps, to stop roja enter assembly..?

Will roja steps in ap assembly atleast on monday

ap assembly, mla roja suspension, rajbhavan, contempt of court, high court, chandrababu, high court judgement, marshals, ap assembly secratary, roja, YSRCP MLA, kodela siva prasada rao, AP Speaker

Even after high court judgement YCP mla Roja is not allowed into assembly, will she step atleast on monday.

సోమవారమైనా రోజా అసెంబ్లీలో అడుగుపెట్టేనా.?

Posted: 03/18/2016 01:58 PM IST
Will roja steps in ap assembly atleast on monday

సినీనటిగా తన కెరీర్ ను నిరూపించుకుని రాజకీయాలలోకి అడుగుపెట్టిన రోజా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు. ఏపీ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని దూసుకుపోతున్న అమె కనీసం సోమవారమైనా అసెంబ్లీలోకి అడుగుపెడతారా..? లేక టీడీపీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన అమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా చేస్తుందా..? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రోజా అంశంపై అపీలుకు వెళ్లాలన్న యోచనలో వున్న టీడీపీ అమెను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా కోర్టును అశ్రయిస్తుందా.? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

విజయవాడ పరిసర ప్రాంతంతో పాటు ఏపీలోని పలు జిల్లాలలో కాల్ మనీ సెక్సు రాకెట్ పడగ విప్పి.. తెలుగింటి అడపడచుల డబ్బును, మానాన్ని దోచుకుని.. సెక్సు రాకెట్ నడపించిన అంశంపై అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. కాల్ మనీ వ్యవహారం మొత్తంగా టీడీపీ వారే వున్నారని, టీడీపీకి చెందిన నేతల పాత్ర వుందని వైసీపీ అరోపించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజపా విరుచుకుపడ్డారు. కాల్ చంద్రబాబు, మనీ చంద్రబాబు, కామ చంద్రబాబు అని నినదించారు.

సభాధ్యక్షుడిగా వున్న ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడంపై సభలోని అధికారపక్షం అమెపై చర్యలకు డిమాండ్ చేసింది. దీంతో అమెను ఏడాది పాటు సస్సెండ్ చేస్తూ సభ తీర్మాణం చేసింది. అయితే ఏడాది పాటు సభ్యురాలిని సస్సెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి, సభకు లేదని తన అక్షేపణను వ్యక్తం చేసిన రోజా తొలుత హైకోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం అదేశానుసారం హైకోర్టు రోజా పిటీషన్ పై విచారణ చేపట్టారు. ఈ మేరకు రోజాపై వేసిన ఏడాది సస్సెన్సన్ చెల్లదని హైకోర్టు తన మద్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ గురువారం తీర్పునిచ్చింది.

గురువారం కోర్టు తీర్పు చేతికి అందిన తరువాత.. తన నియోజకవర్గ ప్రజల విశ్వాసం, తన ఎక్కు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సామాన్యుల స్వరం గెలించిందని భావించిన రోజా.. వడి వడి అడుగులతో అసెంబ్లీకి చేరుకుంది. అయితే అప్పటికే శాసనసభ వాయిదాపడటంతో.. అమె అసెంబ్లీ సెక్రటరీకి తన తీర్పు కాపీని అందజేసి వెళ్లింది. ఇవాళ అసెంబ్లీకి చేరుకున్న అమెను సభలోకి రానీయకుండా అసెంబ్లీ వద్ద మార్షల్ అడ్డుకున్నారు. ఎందుకు అమెను అడ్డుకున్నారన్న విషయమై మాత్రం సభాపతి చెప్పలేదు.

అయితే అర్కే రోజా సస్పెన్షన్పై కోర్టు జారీ చేసిన ఆదేశాల అంశంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా అంశంపై స్పీకర్ కోడెల స్పందించారు. కోర్టు ఉత్తర్వులపై శాసనసభే నిర్ణయం తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులు అసెంబ్లీకి అందాయని చెప్పారు. సభ్యులందరికీ కోర్టు ఉత్తర్వుల కాపీలను అందిస్తామన్నారు. సభ తీర్మానం ఆమోదం మేరకే శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేశామని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక్కడి వరకు బాగానే వున్నా.. ఇప్పటికే న్యాయస్థానం ఉత్తర్వులు అందాయని చెబుతున్న తరుణంలో ఇవాళే ఈ అంశంపై సభలో చర్చించి వచ్చు కదా..? అని ప్రశ్నించింది. అయినా రోజా అంశంపై తీర్పు రాగానే.. ఆర్డర్ కాపీతో అమె వస్తుందని తెలియగానే సభను అర్థంతరంగా ఎలా వాయిదా వేస్తారని స్వయంగా విపక్ష నేత జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక సోమవారం కూడా సభలో ఈ అంశాన్ని చర్చించి.. దీనిపై సభభ నిర్ణయం తీసుకునే లోపు తాము అప్పీలుకు వెళ్లాలని టీడీపీ భావిస్తుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా సోమవారం అప్పీలుకు వెళ్లినా.. ఆ వెంటనే న్యాయస్థానం తీర్పును ఇవ్వలేదు కాబట్టి.. అప్పటి వరకు సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును పాటిందాలి కదా..? మరి అలాంటప్పుడు రోజాను అసెంబ్లీలోనికి అనుమతించాలన్న మరో వాదన కూడా తెరపైకి వస్తుంది. అయితే స్పీకర్ ఈ అంశాన్ని సోమవారం సాయంత్రం తీసుకుని మంగళవారానికి వాయిదా వేసిన పక్షంలో రోజాను మరో రెండు రోజులు అసెంబ్లీలోనికి రాకుండా అడ్డుకోవచ్చును కదా..? అన్న వాదనలు కూడా వినబడుతున్నాయ. దీంతో ఇలా కలిసివచ్చే ఆ రెండు రోజుల్లో రోజా సస్పెన్సన్ అంశంపై అప్పీలుపై న్యాయస్థానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోకలేదని విశ్లేషకులు బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కనీసం సోమవారమైనా అసెంబ్లీలోకి అడుగుపెడతారా..? అన్న ఉత్కంఠ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roja  YSRCP MLA  kodela siva prasada rao  AP Speaker  

Other Articles