chandrababu Naidu may place to anitha instead of Peethala Sujatha

Chandrababu naidu may place to anitha instead of peethala sujatha

Anitha, MLA Anitha, Roja, Chandrababu Naidu, Peethala Sujatha, Ap, AP Ministers

MLA Anitha may get good opportunity to get ministry on Roja issue. Anitha may get peethala Sujatha place in chandrababus cabinet.

మంత్రి పీతలకు అనిత గండం

Posted: 03/25/2016 01:53 PM IST
Chandrababu naidu may place to anitha instead of peethala sujatha

అత్త మీద కోపం దుత్త మీద చూపించారు అని తెలంగాణలో ఓ సామెత ఉంది. అయితే దీన్ని కాస్త మార్చి చెబితే.. ఎవరి మీదో ప్రేమ ఎవరి మీదో చూపించినట్లుంది చంద్రబాబు వ్యవహారం. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో మరొకరిని పక్కన బెడుతున్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఈ మ్యాటర్ ఎవరి గురించి అనుకుంటున్నారా..? మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే అనితల గురించి. ఏపి అసెంబ్లీ వ్యవహారంతో పాయకరావు పేట ఎమ్మెల్యే అనితకు బాగా పాపులారిటీ పొందారు. కాగా ఇప్పుడు అనితకు మంత్రి పదవి దక్కుతుంది అని పుకారు షికారు చేస్తోంది.

అనితకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందా లేదా అన్నది పక్కనబెడితే చంద్రబాబు నాయుడు మంత్రి పీతల సుజాతను తప్పించి అనితకు మంత్రి పదవి కట్టబెడతారని వార్త సంచలనం రేపుతోంది. అనిత ఇటీవల  వైకాపా అధినేత జ‌గ‌న్‌ను త‌న అన్న అని సంబోధించి మంచి కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్న సుజాత రెండోసారి మ‌హిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజాత బాబు కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే సుజాత‌పై ఇప్పటికే ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో పాటు శాఖాప‌రంగా ఆమెకు ప‌ట్టులేద‌ని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు వ‌చ్చే వేస‌విలో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ఆమెను త‌ప్పించి ఆమె స్థానంలో అనిత‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చే సూచ‌న‌లు ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anitha  MLA Anitha  Roja  Chandrababu Naidu  Peethala Sujatha  Ap  AP Ministers  

Other Articles