Jagan will bags only Loss with Dasari

Jagan will bags only loss with dasari

Dasari, Jagan, Dasari Narayana Rao, Pawan Kalyan, AP, YSRCP, YSRCP Party

Jagan Mohan reddy met dasari Narayana rao two days back. many of YSRCP leaders saying that Jagan invited Dasari into YSRCP

దాసరి వల్ల జగన్ కే నష్టం..!

Posted: 01/09/2016 12:26 PM IST
Jagan will bags only loss with dasari

ఏపి ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగుల మీద సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత వస్తోంది. జగన్ తనకు తోచినట్లు వ్యవహరిస్తారని, ఎవరు ఏం చెప్పినా కానీ చెవినపెట్టరని అందరికి తెలుసు. అయితే ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి నష్టమనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం అనుకుంటున్నారా..? దాసరి నారాయణ రావును తమ పార్టీలోకి ఆహ్వానించడం. అయితే దాసరిని తమ పార్టీలోకి అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు వైసీపీ నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినా కానీ దాసరి రాక కోసమే జగన్ అతడిని కలిసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ అలా దాసరిని పార్టీలోకి ఆహ్వానించడం వల్ల పార్టీకి నష్టమా..? అంటే అవుననే చాలా మంది వైసీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారట.

దాసరిని పార్టీలోకి చేర్చుకోవడానికి చెబుతున్న కారణాలు... పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాయట. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే దాసరి కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడం, పైగా పవన్ కళ్యాణ్ సమాజిక వర్గానికి చెందిన వారుకావడంతో పార్టీకి ఆయన చేరిక కలిసి వస్తుందని జగన్ బావిస్తున్నారట. కానీ నిజానికి జగన్ ఊహించిన  పరిణామాలు జరగవని పార్టీ నేతలు గునుక్కుంటున్నారు. ఎందుకంటే.. మొదటిది పవన్, దాసరి ఇద్దరూ కూడా సినీ వర్గానికి చెందిన వారే అయినా కూడా పవన్ తో దాసరిని ఏ మాత్రం పోల్చడానికి వీలులేదు. ఇక సామాజిక వర్గం పరంగా ఆలోచించినా కానీ దాసరి వల్ల పెద్దగా ఓట్లు లేవు... రావు అన్నది అందరికి తెలిసింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా పని చేసిన దాసరి చేసిందేమీ లేదు. పైగా ఇప్పుడు ఆయన బొగ్గు నిక్షేపాల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాకుండా జగన్ వెళ్లి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు కాబట్టి జగన్ మీదనే మొత్తం బారం వేస్తారు. అలా జగన్ కు దాసరి ముందు ముందు భారంగారనే తయారవుతారని అంటున్నారు. మొత్తంగా బేరీజు వేసుకున్నా కానీ దాసరి వల్ల జగన్ నష్టమే తప్ప  కొసరంత లాభం కూడా లేదన్నది వైసీపీ నాయకుల అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari  Jagan  Dasari Narayana Rao  Pawan Kalyan  AP  YSRCP  YSRCP Party  

Other Articles