YS Jagan gave offer to Dasari NarayanaRao

Ys jagan gave offer to dasari narayanarao

YS Jagan, Jagan, Dasari, Dasari Narayana Rao, Rajyasabha

YS JaganMohan Reddy offers Rajyasabha seat to dasari. Political gossip going viral about Jagan offer to Dasari.

దాసరికి జగన్ ఆఫర్ అదేనట..!

Posted: 01/06/2016 11:21 AM IST
Ys jagan gave offer to dasari narayanarao

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత, దర్శకుడు దాసరి నారాయణరావును కలిశారు. జగన్, దాసరి కలయిక మీద తెలుగు మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కాగా జగన్ గత కొంత కాలంగా సీనియర్ నాయకులు మీద దృష్టిసారించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడిని తన క్యాంపులోకి రప్పించుకున్నారు. అయితే తాజాగా మరోసారి జగన్ తన క్యాంపును, బలాన్ని పెంచుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి ఝలక్ ఇచ్చేందుకు జగన్ దాసరిని రంగంలోకి దించుతున్నారని కొత్త చర్చ మీడియాలో సాగింది. తన ఆశిస్సులతొ జగన్ మరిన్ని పదవులు, ఉన్నత స్థాయిలను అందుకోవాలని జగన్చి గురించి దాసరి మీడియా ముందు వెల్లడించారు. అయితే దాసరి నారాయణ రావుతో జగన్ ఎందుకు భేటీ అయ్యారు అన్న దాని మీద రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఓ సామాజిక వర్గాన్ని తనకు దగ్గర చేసుకునేందుకు జగన్ పావుతు కదుపుతున్నారని అందులో భాగంగానే జగన్ దాసరిని కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దాసరి నారాయణ రావు ప్రస్తుతం బొగ్గు కుంభకోణంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఏపిలో కాంగ్రెస్ పరిస్థితి ఎలాగూ దారుణంగా మారింది.. అదీ గాక తొందరలోనే తమకు రాజ్యసభ సీటు వస్తుందని కాబట్టి దాసరి తమ పార్టీలోకి చేరితే ఆ రాజ్యసభ సీటు కేటాయిస్తామని వైయస్ జగన్ దాసరికి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే దీనికి దాసరి కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది. మరి చూడాలి తొందరలోనే జగన్ క్యాంపులోకి దాసరి కూడా చేరుతారా అన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Jagan  Dasari  Dasari Narayana Rao  Rajyasabha  

Other Articles