court disqualifies patancheru mla membership from assembly

Patancheru trs mla mahipal reddy disqualified with court decision

TRS MLA Mahipal Reddy, Patancheru Mla disqualify, trs mla mahipal reddy disqualified, mahipal reddy disqualified, Medak district, Mahipal Reddy imprisonment, Mahipal Reddy criminal intimidation, Additonal judicial firstclass magistrate D Durgaprasad, fine of `2,500, Mahipal Reddy filthy language, Mahesh, Versatile industry, Pashamailaram IDA, Chandu Kumar, BDL police station, Mahipal Reddy forcefully cheque of Rs 15 lakh,

court disqualifies patancheru trs mla mahipal reddy membership from assembly with immidiate effect on the day of convicting him in a case

పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు..?

Posted: 12/14/2015 12:43 PM IST
Patancheru trs mla mahipal reddy disqualified with court decision

అదృష్టం సరిగా లేకపోతే తాడే పామై కరుస్తుందని నానుడి. సరిగ్గా అలానే జరిగింది పటాన్‌చెరు అధికార పార్టీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి విషయంలో. ఎమ్మెల్యే కావాలని ఆయన చేసిన అనేక ప్రయత్నాలు పలించి ఇప్పటికి ఆయన కల సాకరం అవ్వగా, అది పరిపూర్ణం కాకుండానే అయనను పదవి వీడి పోనుంది. అయనపై అనర్హత వేటు పడింది. దౌర్జన్యం కేసులో గురువారం రెండున్నరేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో ఆయనపై న్యాయస్థానం తీర్పుతో అనర్హత వేటు పడింది. అంతేకాదు రానున్న ఎన్నికలలో ఆయన పోటీ చేసేందుకు కూడా అనర్హుడు కావడంతో ఈ విషయమై ఆసక్తికర చర్చకు తెరతీస్తుంది.

కాగా మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి మృతితో ఖాళీగా మారిన సదరు స్థానంతో పాటు పటాన్ చెరు నియోజకవర్గానికి ఒకే సారి ఉప ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా వార్తలు వినబడుతున్నాయి.  అయితే మహిపాల్ రెడ్డికి ఎదురైన అనూహ్య పరిణామాలను పరిశీలిస్తే.. ఆయన న్యాయస్థానం రెండున్నరేళ్లు కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రెండు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది. అయితే మహిపాల్ రెడ్డి తాను హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. అక్కడ న్యాయస్థానం తీర్పుకు మహిఫాల్ రెడ్డికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఆయన సభ్యత్వం కొనసాగుతుంది. అయితే అంతలోపు ఎన్నికలను నిర్వహించిన పక్షంలో అనర్హత వేటు పడిన మహిపాల్ రెడ్డి మరో సారి పోటీ చేయడానికి కూడా అనర్హుడు. హైకోర్టు మహిఫాల్ రెడ్డినీ నిర్దోషిగా పరిగణించిన నేపథ్యంలో తన శాసనసభ్యత్వాన్ని తిరిగి పోందేందుకు ఆయన మరోమారు ఎన్నికలలో పోటీ చేయాల్సి వుంటుంది

ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడిన ఏ ప్రజా ప్రతినిధి అయినా అనర్హత వేటుకు గురి కావాల్సిందే. దీనిని అసుసరించే గతంలో బిహార్‌ మాజీ ముఖమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌యాదవ్‌ తన ముఖ్యమంత్రి పదవితో పాటు ఇటీవల ఎంపి పదవిని కోల్పోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సైతం పదవికి దూరమై తమ పార్టీ ఎమ్మెల్యే పన్నిను సెల్వంను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిని చేశారు.

ఈ కేసులను పరిశీలించగా, రెండున్నరేళ్లకు పైగా శిక్షపడిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా తన పదవిని కోల్పోవడం ఖాయం కాగా, ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ సారి ఎవరికీ టిక్కెట్ కేటియిస్తుందన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి టిక్కెట్ కేటాయిస్తారా..? లేక మరో నాయకుడిని ఎంచుకుంటారా..? అన్నది పార్టీ అధిష్టానానికే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS MLA  Mahipal reddy  court  disqualify  

Other Articles