The BJP is yet to take a decision, although the focus at present is concentrated on fielding Varun Gandhi against Akhilesh Yadav and Rahul Gandhi.

Varun gandhi set to bjp face in 2017 uttar pradesh elections

BJP, Amit shah, PM Modi, Varun Gandhi, CM candidate, Uttar Pradesh, Menaka Gandhi, Akhilesh Yadav, Rahul Gandhi.NDA, UP Elections, Varun Gandhi Ideal CM Candidate, Varun Gandhi CM Candidate for UP, Modi Wave, Jammu and kashmir, Maharastra

The BJP is yet to take a decision, although the focus at present is concentrated on fielding Varun Gandhi against Akhilesh Yadav and Rahul Gandhi.

యూపీ బీజేపి సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ..?

Posted: 12/09/2015 06:24 PM IST
Varun gandhi set to bjp face in 2017 uttar pradesh elections

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర పరాజయం తరువాత ఇటు మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ లలో కూటములతో కలసి అధికారాన్ని పంచుకున్న బీజేపి.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తరువాత సోస్టుమార్గం నిర్వహిందింది. కేంద్రంలో అధికారానికి అందించిన మద్దతును బీహార్ ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎందుకు తమకు దూరమైయ్యారన్న కారణాలను విశ్లేషించుకుంది.  మహా కూటమి పేరిట బరిలోకి దిగిన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయన్న విషయాన్ని అంగీకరించాయి.

అయితే బీజేపీ మాత్రం తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటించినా ఫలితం లేకపోయింది. ఇక దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రంగా పరిగణిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017లో జరగనున్నాయి. బీహార్ కంటే యూపీలో బీజేపీ బలం బాగానే ఉంది. అయితే, బీహార్ లో మాదిరిగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా బరిలోకి దిగితే ఇబ్బందులు తప్పవన్న భావన ఆ పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది.

అంతేకాక ఇప్పటికే యూపీ సీఎంగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ దూసుకెళుతున్నారు. మరోవైపు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రూపంలో పెను ముప్పే పొంచి ఉందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రభావమే చూపనున్నారు. ఈ క్రమంలో వీరందరినీ నిలువరించి ఎన్నికల్లో సత్తా చాటాలంటే, ముందుగానే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ నేతలు దాదాపుగా నిర్ణయించారు.

ఈ పేరు ఎవరిదైతే బాగుంటుందన్న కోణంలో యోచించిన ఆ పార్టీ అగ్రనేతలకు మేనకా గాంధీ కుమారుడు, సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ కనిపించారు. యువ నాయకులుగా ఇటు రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్, అటు జాతీయస్థాయిలో రాహుల్ గాంధీలు దూసుకుపోతున్న తరుణంలో.. వారికి వయస్కుడైన వాడినే ఎంపిక చేయాలని వరుణ్ గాంధీ పేరును ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు నేతలైతే వరుణ్ ను మించిన ప్రత్యామ్నాయం మరేదీ లేదని కూడా చెబుతున్నారు. దీంతో యూపీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ రంగంలోకి దిగనున్నారన్న ఊహాగానాలు బీజేపీలో జోరుందకున్నాయి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Amit shah  PM Modi  Varun Gandhi  CM candidate  Uttar Pradesh  

Other Articles