Raja Singh Attracted To Ruling TRS Operation Akarsh

Goshamahal mla raja singh to join trs

bjp mla raja singh, goshamahal mla raja singh, bjp, telangana bjp president kishan reddy, trs, kcr, trs operation akarsh, sayanna, prabhakar, congress, TDP, raja singh TRS, raja singh kishan reddy

if reports are to be belived, goshamahal mla rajasingh is preparing ground to join ruling trs party

కారు ప్రయాణానికి సిద్దమవుతున్న రాజాసింగ్..?

Posted: 12/04/2015 01:22 PM IST
Goshamahal mla raja singh to join trs

తెలంగాణలో బీజేపీలో కూడా విబేధాల అగ్గి రాజుకుంది. బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డినే టార్గెట్ చేసి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు సంధించడంతో..ఆ పార్టీలోనూ లుకలుకలు బయటపడ్డాయి. కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షపదవి నుండి తొలగించాలని జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాయడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పై కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని అరోపణలు మిన్నంటుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాజసింగ్ తదుపరి వ్యూహం ఏంటని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీకి నిబద్దత కలిగిన నాయకుడిగా వుంటున్న రాజాసింగ్ పార్టీని వీడునున్నారా అన్న చర్చ జరుగుతుంది. రాజాసింగ్ కూడా అధికార టీఆర్ఎస్ అపరేషన్ ఆకర్ష్ పథకానికి లోనైయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి బీజేపి వర్గాలు. టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు జరిగిన తర్వాతే.. రాజాసింగ్ కిష‌న్‌ రెడ్డిపై ఆయ‌న బహిరంగ విమర్శలకు దిగారని వారు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్, స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తన పార్టీలోకి చేరేవిధంగా చేసింది. అలాగే రాజాసింగ్ కు కూడా టీఆర్ఎస్ పార్టీ గాలానికి పడ్డారని, కాగా తనంతట తాను పార్టీలో చేరకుండా.. బీజేపి పార్టీయే తనను సస్పెండ్ చేస్తే.. ఆ తరువాత తాను అధికార పార్టీలోకి చేరాలని ఆయన వ్యూహం రచించుకున్నారని తెలుస్తుంది. అందుకనే రాజకీయ సచ్ఛీలుడిగా హ్యాట్రిక్ వీరుడిగా వున్న కిషన్ రెడ్డిని అందులోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేసి వ్యాఖ్యాలు చేస్తే తప్ప తాను అనుకున్నది జరగదని ఇలా చేశాడంటున్నాయి బీజేపి వర్గాలు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp mla raja singh  bjp  kishan reddy  trs  

Other Articles