TRS has fear about the legislative council elections

Trs has fear about the legislative council elections

TRS, Congress, legislative council, Elections, TRS party, TRS Plan for Elections

TRS party fearing about the elections. In the legislative council TRS party concentrate on TDP. If the TRS party not get suficient Majority then TRS will alliance with congress

టిఆర్ఎస్ కు మండలి ఎన్నికల ఫీవర్

Posted: 12/02/2015 12:42 PM IST
Trs has fear about the legislative council elections

తెలంగాణాలో మండలి ఎన్నికలు అధికార పార్టీ నేతల్లో కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ పార్టీ ఆశావహులు కొందరు టికెట్లు తమకే దక్కుతాయని ఆశపడుతూ వచ్చారు. కానీ విపక్షాలతో పొత్తులు ఉండొచ్చన్న ప్రచారం గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. పైగా ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు పదవులు కట్టబెడుతుండడంతో కోపాన్ని దిగమింగుకోలేక బయటకు కక్కలేక విలవిల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్‌ఎస్‌లోకి రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున కారెక్కుతున్నారు. దీంతో పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు తమకు పదవులు దక్కుతాయనుకున్నా కొత్త వారికి ప్రాధాన్యత దక్కుతుండడంతో అసంతృప్తితో రగులుతున్నారు.

Also Read: ఎబిఎన్ తో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు దెబ్బా..?

టిఆర్‌ఎస్‌కు టిడిపి ఎంత శత్రువో కాంగ్రెస్‌కూడా అంతే స్థాయిలో శత్రువు. కానీ శాసనమండలి ఎన్నికల విషయానికొచ్చేసరికి టిడిపియే ప్రధాన ప్రత్యర్థిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో టిఆర్‌ఎస్‌ ఆ పార్టీకి స్థానం దక్కుండా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆ పార్టీ బలం ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ప్రధానంగా ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టిడిపి ప్రభావితం చేస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఆ జిల్లాల్లో ఇప్పటికే ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించడంతోపాటు పూర్తి మెజార్టీ సాధించే దిశగా గులాబి పార్టీ అడుగులు వేస్తోంది.

Also Read: కేసీఆర్ పై చెలరేగుతున్న మీడియా ఆగ్రహజ్వాలలు!

ఎన్నికల నాటికి పరిస్థితులు అధికార పార్టీ గుప్పిట్లోకి రాకపోతే రెండో వ్యూహంలో భాగంగా ఆ జిల్లాల్లో కాంగ్రెస్‌ మద్దతు కూడగట్టే ఆలోచనా ఉంది. ఇదే అమలు చేయాల్సొస్తే ఒకటి రెండు స్థానాలను పొత్తుకుదుర్చుకున్న పార్టీకి వదులుకోవాల్సొస్తుంది. ఇవే అనుమానాలు అధికార పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. దీంతో టిఆర్‌ఎస్‌ ఆశావహుల్లో దిగులుమొదలైంది. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందోనన్న ఉత్కంఠ ఆ నేతల్లో కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Congress  legislative council  Elections  TRS party  TRS Plan for Elections  

Other Articles