వరంగల్ లో ఓటమి.. బాబుకు ముందే తెలుసా..?

Is naidu know defeat of warangal elections

Chandrababu Naidu, Warangal, Elections, Election in Warangal, Warangal polls, Babu in Warangal, KCR, Jagan, Roja, Warangal Loksabha Elections

TDP President Chandrababu Naidu didnt participated in warangal elections. All partied leaders participating in the election campaign But not chandrababu Naidu

వరంగల్ లో ఓటమి.. బాబుకు ముందే తెలుసా..?

Posted: 11/19/2015 03:20 PM IST
Is naidu know defeat of warangal elections

వరంగల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బరిలో నిల్చున్నారు. గతంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా కుదర్చుకున్న ఎన్డీయే కూటమి ఒప్పందంలో భాగంగా వరంగల్ ఎన్నికల బరిలో ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి పార్టీకి చెందిన నేతను నిలబెట్టింది. అయితే ఎన్నికల అనగానే అన్ని పార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తుంటారు అందులో భాగంగానే కేసీఆర్, జగన్ లాంటి నేతలు ప్రచారానికి ముందుకు వచ్చారు. అయితే అన్ని పార్టీలు తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. బిజెపి పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగినా కానీ ప్రచారం నిర్వహించడంలో ఎక్కడో లోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర మంత్రులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పర్యటనకు రావడం లేదు.

Also Read: జగన్ కు షర్మిల కన్నా రోజా ఎక్కువా..?

చంద్రబాబు నాయుడు వరంగల్ ఎన్నికల బరిలో ఎందుకు ప్రచారం నిర్వహించడం లేదు..? టిడిపి బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలుచుకున్నా ప్రచారానికి దూరంగా ఉండటంలో అర్థం ఏంటి..? అసలు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారా..?? ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ ఎన్నికల బరిలో జగన్ పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. అందుకే రెండు రోజులుగా వరంగల్ లోనే మకాం వేసి మరీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి జగన్ చేసినప్పుడు అంతకంటే సీనియర్, పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు రావడం లేదు అన్నది అనుమానాలకు తావిస్తోంది.

చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ఫలితాల మీద ముందే సర్వే నిర్వహించడం అలవాటు. గత లోక్ సభ ఎన్నికల్లో కూడా ముందుగానే సర్వే నిర్వహించి. ఫలితాలను బేరీజు వేసుకొని ముందుకు సాగారు. అయితే మరి వరంగల్ ఎన్నికల్లో కూడా ఫలితాలను ముందే బేరీజు వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ ఎన్నికల్లో బిజెపి-టిడిపి పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని అందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఎదుర్కోవడంలో ఉమ్మడి అభ్యర్థి విఫలమవుతున్నారని. ఫలితంగా ఎన్నికల్లో పార్టీ ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే దానికి చంద్రబాబును బాధ్యతవహించాల్సిందిగా విమర్శలకు తావిచ్చినట్లవుతుందని అందుకే చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి దీంట్లో ఎంత వరకు నిజముందో చంద్రబాబుకే తెలియాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles