Centre won't stop Bihar's special package even if BJP loses: Rajnath Singh

Rajnath not enough confident of bjp winning bihar polls

union home minister rajnath singh, Bharatiya Janata Party senior leader Rajnath Singh, Rajnath Singh on bihar special package, Rajnath Singh on bihar development, Rajnath Singh on bihar elcections, bihar, bihar assembly elections 2015, bihar development, BJP, Rajnath singh

Home Minister and senior Bharatiya Janata Party leader Rajnath Singh said Centre won't stop Bihar's special package even if BJP does not come to power

రాజ్‌‌నాథ్ సింగ్ వ్యాఖ్యాల అంతరార్థం ఏమిటీ..?

Posted: 10/14/2015 04:31 PM IST
Rajnath not enough confident of bjp winning bihar polls

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో రెండు కూటముల మద్య నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోరులో.. ఒకరిని మించి మరోకరు చేస్తున్న ప్రచార హోరు.. ఒకరిపై మరోకరు విసురుతున్న విమర్శల జోరు.. రెండు కూటములు రమారమి స్థానాలను సాధిస్తాయన్న ప్రీ ఫోల్ సర్వేలు.. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే బీహార్ కాదు యావత్ ప్రపంచం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తుంది. యావత్ భారతం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. అధికార పీఠం అధిరోహించే వారెవరు..? మోడీ మానియాకు ఏడాదిన్నర కాలంలోనే కాలం చెల్లిందా..? లేక పటిష్టంగానే వుందా..? అన్నదే హాట్ టాపిక్ గా మారింది.

అయితే తొలి విడత ఎన్నికల సరిగ్గా ఒక్క రోజు ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపి గెలుపోటములను ప్రభావితం చేసేలా వున్నాయి. అసలాయన అలా ఎందుకు వ్యాఖ్యానించారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. రాజ్‌‌నాథ్ సింగ్ కు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి గెలుస్తుందన్న నమ్మకం లేక అలా వ్యాఖ్యానించారా..? లేక తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టబడుతుందని చెప్పడానికే అలా వ్యాఖ్యానించారా..? అన్నది అటు పార్టీ నేతలకు, ఇటు బీహార్ ఓటర్లకు అర్థంకాక సందిగ్థంలో పడ్డారు.

ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి అధికారంలోకి రాకపోయినా.. ప్రథాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డకోదని అయన  స్పష్టం చేశారు. లక్షా పాతికవేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామన్నారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రం కోరుకుంటుందని చెప్పుకోచ్చారు. బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై ఏర్పడిన సందేహాలకు మళ్లీ కేంద్రం మంత్రి స్పష్టతనిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  bihar assembly elections 2015  bihar development  BJP  Rajnath singh  

Other Articles