Coal scam: Relief for Manmohan Singh, court dismisses Koda's plea

Dasari blame game after former pm whom

manmohan singh, coal scam, clean chit, coal case, coal gate, dasari narayana rao, ex-pm manmohan singh, madhu koda, coal allocation, coal block, cbi, latest news

A special court today dismissed the plea of ex-Jharkhand Chief Minister Madhu Koda seeking to summon former Prime Minister Manmohan Singh as an additional accused in a coal scam case.

కోల్ రత్న దాసరి భవితవ్యం ఏమిటీ..?

Posted: 10/16/2015 08:33 PM IST
Dasari blame game after former pm whom

బొగ్గు కుంభకోణం నుంచి మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ కు పూర్తి విముక్తి లభించినట్లే. సిబిఐ కోర్టు ఆయనపై అభియోగాలు మోపాలన్న పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో ఇక ఈ కుంభకోణానికి తెరతీసిందెవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అయనదే పూర్తి బాధ్యతని, ఆయనను విచారిస్తే అన్ని నిజాలు బయటపడతాయని చెబుతూ వచ్చిన మిగతా నిందితులకు సిబిఐ కోర్టు వెలువరించిన తీర్పు మింగుడు పడటం లేదు.

ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆదారాలు లేవని సిబిఐ గతంలో చెప్పినా, కోర్టు సమన్ లు జారీ చేయాలని ఆదేశించింది. దానిపై సింగ్ సుప్రింకోర్టును ఆశ్రయించారు.సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి సిబిఐ కోర్టు ఈ కేసులో సిబిఐ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మన్మోహన్ సింగ్ పై కేసు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో మన్మోహన్ సింగ్ పేరు తొలగిపోవడంతో.. ఆయన తరువాత నిందుతుల జాబితాలో వున్న అప్పటి కేంద్ర మంత్రి.. ఈ వివాదంతో కోల్ రత్నగా మారిన దాసరి నారాయణరావు భవితవ్యం ఏమిటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

కోల్ గేట్ స్కాంలో దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్‌ జిందాల్‌, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అయితే సిబిఐ న్యాయస్థానంలో దాసరి మదుకోడా వ్యాఖ్యలను అప్పట్లో సమర్థించారు. అయితే మన్మోహన్ పేరు తొలగింపుతో ఇప్పుడా అసలు తప్పు ఎవరు చేశారు..? ఎక్కడి నుంచి కుంభకోణం అజ్యం పోసుకుంది..? జిందాల్ గ్రూప్ కు గనులను ఎలా కేటాయించారు.? ఇందులో క్విడ్ ప్రోకో ఏ మేరకు వుందన్న దిశగా సిబిఐ విచారణ జరుపుతుంది. కాగా, నిజానిజాలేమిటన్నది న్యాయస్థానమే తేల్చాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manmohan singh  clean chit  coal case  coal gate  dasari narayana rao  

Other Articles