special status cannot solve all problems says venkaiah naidu

Venkaiah naidu controversial statements again on ap special status

Venkaiah naidu controversial statements on ap sprecial status, Venkaiah naidu on ap sprecial status, special status cannot solve all problems says venkaiah, venkaiah at nellore on special status, Union minister Venkaiah naidu controversial statements, venkaiah naidu, ap special status, nellore, podalakur

Union minister Venkaiah naidu controversial statements on ap sprecial status, says it cannot solve all problems in the state

ఏ ఎండకా గోడుగు.. ఘనాపాటి వెంకయ్య

Posted: 10/07/2015 01:47 PM IST
Venkaiah naidu controversial statements again on ap special status

కేంద్రంలో చక్రం తిప్పగల సత్తా వున్న మంత్రి, బిజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు.. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో విషయంలో ఏ ఎండకు ఆ గోడుగు పట్టడంతో ఘనాపాటిగా మారుతున్నారు. ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని సమస్యలు తీరవని ఆయన ఇవాళ నెల్లూరులో సెలవిచ్చారు. ప్రత్యేక హోదాకు మించి ఏపీకి అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద న్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో 30 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి వెంకయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం కల్పించడం లేదంటూ ఇటీవల రాష్ట్ర ప్రజలు పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. తిరుపతి లో మునికామకోటి నుంచి ప్రారంభమైన ఈ ఆత్మార్పణల నేపథ్యంలో ఇటు తెలుగుదేశం ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు కోనసాగుతున్నాయని నేతలు వెల్లడించారు. స్వయంగా అరుణ్ జైట్లీ ఈ ప్రకటన చేశారు. అయితే ప్రజాగ్రహం సమసిపోయిందనుకున్న తరుణంలో మరోమారు వెంకయ్య నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు వున్నాయి.

వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై మళ్లీ ప్రజల్లో నిరసనలు పెల్లుబిక్కే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని మిత్రపక్షం అండతో ప్రతిపక్ష నేత జగన్ తలపెట్టిన దీక్షను అనుమతిని నిరాకరిస్తూ.. ప్రస్తుతానికి పబ్బం గడుపుకుంటున్నా.. ప్రజల్లో ఇది తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తే.. అప్పుడెదురయ్యే ప్రమాదాన్ని మాత్రం ఊహించలేకపోతున్నారు. ప్రత్యేకహోదాతో రాష్ట్రానికి జరిగే లాభం కన్నా ప్యాకేజీలతో అధిక లాభం చేకూరుస్తామన్న వెంకయ్య.. రాష్ట్ర పునర్విభజన బిల్లును యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో అమోదించే క్రమంలో అప్పటి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు వద్దని, ప్రత్యేకహోదా కావాలని ఎందుకు డిమాండ్ చేశారో ఆయనకైనా అర్థమయితే బాగుండు. ఇక చివరాఖరున మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే అంశం నీతి ఆయోగ్‌ పరిశీలనలో ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నడం కొసమెరుపు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  ap special status  nellore  podalakur  

Other Articles