Telangana assembly session may close soon

Assembly sessions may close

Telangana, Assembly, Oppositions, KCR, VenuGopala chary, TRS, MIM

Telangana govt likely to close this assembly sessions as soon as possible. Actually assembly sessions has to run to this month 10th.

అసెంబ్లీకి అప్పుడే మంగళం..!

Posted: 10/07/2015 09:59 AM IST
Assembly sessions may close

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పేలవంగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేకుండా ఎలాంటి చర్చలు జరగకుండానే సాగుతున్న అసెంబ్లీ సమావేశాలను త్వరగా ముగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నేత, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా, కాంగ్రెస్, టీడీపీ, బిజెపి, వామపక్షాలు, వైసీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్స్ మెత్తానికి సస్పెండ్ చేసింది ప్రభుత్వం.ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేకుండానే.. తెలంగాణ అసెంబ్లీ నడిచింది. ముందే నిర్ణయించిన ఎజెండాలోని ప్రశ్నోత్తరాలు, వ్యాట్ సవరణ బిల్లు ఆమోదం, వాటర్ గ్రిడ్ పై చర్చ జరిగాయి. విపక్ష సభ్యులు లేకపోవడంతో అధికార పార్టీ సభ్యులే ప్రశ్నించడం, మంత్రులు సమాధానం చెప్పడంతో సభ చప్పగా సాగింది.

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంతో ఇక సభలో మాట్లాడే అవకాశం లేదని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజాబాట పట్టాయి. కాంగ్రెస్ రైతు భరోసా యాత్రని పాలమూరు నుంచి, టిడిపి-బిజెపిలు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి ఆందోళనలు ప్రారంభించాయి. దీంతో... సభలో టీఆర్ ఎస్, ఎంఐఎం మాత్రమే మిగలడంతో విపక్షాలు లేని వెలితి స్పష్టంగా కనిపించింది. ఇలా సభలో ప్రతిపక్షాలు లేకుండా నడిపితే ఎంత మాత్రం బాగుండదని ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభను షెడ్యూల్ కంటే ముందే ముగించేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది.  బీఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 10వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా... విపక్షాలు లేకపోవడంతో నేటి సాయంత్రానికే సభను  ముగించే యోచన చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Assembly  Oppositions  KCR  VenuGopala chary  TRS  MIM  

Other Articles