Rahul Gandhi or Sonia Gandhi: Who will preside the Congress for 2016?

Congress panel to debate rahul gandhis promotion

Narendra modi, lalith modi scam, sushma swaraj, rajasthan chief minister, lalith gate, vasundhara raje, shivraj singh, vyapam scam shivraj singh chouhan, madhyapradesh,

The much-awaited coronation of Rahul Gandhi is delayed once again, as Sonia Gandhi will continue to hold the top post for another year.

సరైన సమయంలోనే.. యువరాజుకు బాద్యతలు..?

Posted: 09/08/2015 06:58 PM IST
Congress panel to debate rahul gandhis promotion

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు పార్టీ యువరాజు, యువనేత రాహుల్ గాంధీకి అప్పగించాలని ఓ వైపు పార్టీకి చెందిన యువనాయకులతో పాటు మరికోందరు ముఖ్యనేతలు తమ మనస్సులోని మాటలను బాహాటంగా చెబుతున్నప్పటికీ ఈ పదవి మాత్రం రాహుల్ గాంధీకి సరైన సమయంలోనే దక్కుతుందని పార్టీ వర్గాలు సమాచారం. పదేళ్ల అధికారం పర్వం తరువాత ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ ను యువనేత రాహుల్ ఎలా ముందుకు తీసుకెళ్తాడన్న విషయం తెలుసుకున్న తరువాతే బాధ్యతలు అయనకు అప్పగించనున్ానరని సమాచారం.

పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న తరువాత రెండు నెలల సుదీర్ఘ పెలవుపై వెళ్లి వచ్చిన తరువా రాహుల్ గాంధీ అంతకుముందుకన్నా రెట్టించిన ఉత్సాహంతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నారు. వచ్చి రావడంతోనే భూసేకరణ చట్టానికి చేసిన సవరణలు వెనక్కుతీసుకోవాలని ఉద్యమించారు. రమారమి ఏడాది కాలం తరువాత కేంద్రంలోని మోడీ సర్కార్ ల్యాండ్ బిల్లును వెనక్కుతీసుకుంది. ఇక ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీకి సహకరించారన్న కేసులో అటు రాజస్తాన్ ముఖ్యమంత్రితో పాటు ఇటు కేంద్ర మంత్రి సుష్మాసర్వాజ్ లను ముప్పుతిప్పలు పెట్టడంలోనూ రాహుల్ సఫలీకృతుడయ్యాడు. వ్యాపం కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చైహాన్ ప్రభుత్వాన్ని నిలదీసి ఎట్టకేలకు ఈ కుంభకోణం మరణాలపై సిబిఐ విచారణ చేపట్టేలా చేశాడు

గత ఏడాది కాలంగా రాహుల్ గాందీ పార్లమెంటు లోపలా, వెలుపలా అటు ప్రభుత్వ తప్పిదాలను, ప్రధాని మంత్రి నరేంద్రమోడీ ప్రసంగాలను ఉటంకిస్తూనే విమర్శలను చేస్తున్నారు. కేంద్రంలోని ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రజావ్యతిరేక చర్యలను సమర్థవంతంగా తిప్పికోడుతున్నాడు. ఇలానే ముందుకెళ్తూ ప్రజల్లో రాహుల్ మరింత మెరుగైన నాయకుడిగా స్థానం సంపాదించాలని, అంప్పటి వరకు ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించలేమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అటు ప్రజలతో మమ్మేకమై నిర్వహించే కార్యక్రమంలతో పాటు పార్టీ బాధ్యతలను కూడా చూసుకోవడం కష్టంగా పరిణమిస్తుంనందునే సరైన సమయంలోనే రాహుల్ కు పార్టీ బాధ్యతలను అప్పగించనున్నామని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు సోనియా గాంధీయే పార్టీ అధ్యక్షురాలి హోదాలో కొనసాగునున్నారని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Sonia Gandhi  Rahul Gandhi  President  AICC president  

Other Articles